కానీ.. విచిత్రంగా ఈ కార్యక్రమం ఆహ్వానితుల జాబితాలో రఘురామ కృష్ణంరాజు పేరు లేదు. దీంతో రఘురామ కృష్ణంరాజు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆహ్వానం లేకపోయినా వెళ్దామని హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో రఘురామ కృష్ణంరాజు బయల్దేరారు. కానీ.. రాత్రి బేగంపేట రైల్వేస్టేషన్‌లోనే అర్ధంతరంగా ఆయన దిగిపోయారు. అలా ఎందుక చేయాల్సి వచ్చిందో వివరిస్తూ.. తన భీమవరం పర్యటన రద్దుకు గల కారణాలు చెబుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏమంటున్నారంటే.. భీమవరంలో తన అనుచరులు కొందరిపై ఇప్పటికే పలు కేసులు పెట్టారట. సుమారు 55 మంది తన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారట. వారి పట్ల చాలా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారట. ప్రధానితో కార్యక్రమానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వెళ్తే ఇంకా ఇబ్బంది పెడతామని వారికి చెబుతున్నారట. తాను భీమవరం వెళ్లకపోతే తన అనుచరులను వదిలేస్తామని పోలీసులు బెదిరించారట.
మరీ దారుణంగా అనుచరుల పిల్లలతో ఫోన్లు చేయించి మరీ తాను రాకుండా చేశారట. చివరకు తన శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోసం తానే ఒక అడుగు వెనక్కి వేయదలుచుకున్నారట. తన కోసం ఎవరూ భీమవరం రావొద్దంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాను విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. జగన్ అంటే ఓకే.. మరి పీఎంఓ కూడా ఎందుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజును దూరం పెట్టిందో మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి