ఈరోజుల్లో మొబైల్ చేతిలో లేకుండా క్షణం ఎటూ పాలుపోదు. ఏ పని చేయాలన్నా సెల్ ఫోన్ ఉండాల్సిందే. చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ఎంటర్‌ టైన్‌మెంట్ కావాలన్నా.. ఫ్రెండ్స్ తో మాట్లాడాలన్నా.. ఏదైనా సరే.. సెల్ఫోన్‌కు అంతగా మనం బానిసలమయ్యాం. అయితే.. ఇన్ని అందుబాటులో వచ్చినా.. ఇంకా టీవీ కార్యక్రమాలు మాత్రం టీవీలోనే చూసుకోవాల్సి ఉంటుంది.

సెల్ ఫోన్‌లో టీవీ చూడాలంటే.. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌ కానీ.. ప్రత్యేకమైన యాప్‌లు కానీ వాడాల్సి ఉంటుంది. అయితే.. ఇక ఆ ఇబ్బంది లేకుండా మీ మొబైలే మీ టీవీ కాబోతోంది. ఇప్పటి వరకూ  కొన్నిరకాల యాప్‌ల ద్వారానే....వివిధ టీవీ కార్యక్రమాలను చూస్తున్న వారికి  కేంద్ర సమాచార శాఖ ఓ మంచి శుభవార్త  చెప్పింది. ఇక అన్ని రకాల టీవీ కార్యక్రమాలను.......నేరుగా సెల్‌ఫోన్‌కే  ప్రసారం చేసే విధానం.. త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం  యత్నిస్తోంది.


ముందుగా ఈ పైలట్‌ ప్రాజెక్టు కింద దేశ రాజధాని ప్రాంతంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని  కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎఫ్‌ఎం రేడియోలాగే ...పని చేస్తుందని  కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  కార్యదర్శి అపూర్వ చంద్ర  అంటున్నారు. అందులో  రేడియో ఫ్రీక్వెన్సీ అందుకోడానికి...  ఒక రిసీవర్ ఉంటుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  కార్యదర్శి అపూర్వ చంద్ర చెప్పారు.


ఇక బ్రాడ్‌ బ్యాండ్ , బ్రాడ్‌ కాస్ట్ సాంకేతికతలను కలిపి మొబైల్  ఫోన్లలో..డిజిటల్ టీవీ కార్యక్రమాలు అందుకునేలా చేస్తామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  కార్యదర్శి అపూర్వ చంద్ర  అంటున్నారు. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్లకు కూడా మల్టీ మీడియా కంటెంట్ నేరుగా వస్తుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  కార్యదర్శి అపూర్వ చంద్ర  చెబుతున్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన బిగ్ పిక్చర్‌ సమిట్‌లో మాట్లాడిన అపూర్వచంద్ర ఇక టీవీ ప్రసారాలు నేరుగా సెల్‌ఫోన్‌కు అందితే వీక్షకుల  సంఖ్య కొన్నిరెట్లు పెరుగుతుందంటున్నారు. ఇక ఇప్పటి పరిస్థితి చూస్తే.. ప్రస్తుతం దేశంలో  20 కోట్ల టీవీలు ఉన్నాయి. 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అలాగే దేశంలో 80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: