ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్లెక్సీ ప్రింటింగ్ నిషేధం వేల మంది పొట్టకొడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నిషేధంపై ప్లెక్సీ ప్రింటింగ్ నిర్వహకులు మండిపడుతున్నారు. అయితే.. ప్లెక్సీ ప్రింటింగ్ కు ప్రత్యామ్నయ మార్గాలపై తాజాగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఓ సదస్సు నిర్వహించారు. అందులో ఫ్లెక్సీలకు ప్రత్యామ్నాయం అంటూ కొన్ని పద్దతులు వివరించారు. అయితే.. ఇవేవీ ఆచరణాత్మకంగా లేవి.. వీటితో వ్యాపారం సాగదని ప్లెక్సీ ప్రింటింగ్ నిర్వహకులు అంటున్నారు.


జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో తాము రోడ్డున పడుతున్నామని వారు వాపోతున్నారు. అనూహ్యంగా పెట్టిన ఈ నిషేధం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లుతుంది మంచిదే అయితే..దాని కార్యాచరణ మాత్రం ఇలా కాదని ప్లెక్సీ ప్రింటింగ్ నిర్వహకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాటన్ పై ప్రింటింగ్ వేసేలా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చెబుతున్న విధానం తమకు ఉపయోగడదని ఏపీ ప్లెక్సీ ప్రింటింగ్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.


తాము లక్షల రుపాయాల ఖర్చు చేసి కొన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్లు ఏం చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అనూహ్యంగా జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లెక్సీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సరికాదని వారు వాదిస్తున్తనారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సూమారు 900 వరకు ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయని అంచనా. వీటిని నమ్ముకుని  50 వేల నుంచి 60 వేల మందికి పైగా జీవిస్తున్నారు.


ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల ఫ్లెక్సీ ప్రింటింగ్ రంగం మూతబడే పరిస్థితి వస్తుందని ఫ్లెక్సీ ప్రింటింగ్‌ నిర్వాహకులు వాపోతున్నారు. ప్లాస్టిక్ ను ప్రత్యమ్నాయంగా ఏం వినియోగించాలో అధికారులకే సరైన అవగాహన లేదని వారు ఆరోపిస్తున్నారు. పెద్ద కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి తమ జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: