నమ్మించి మోసం చేయడంలో పాకిస్తాన్ తర్వాత ఏ దేశమైనా అని మరోసారి రుజువు అయింది. ఒకప్పుడు కార్గిల్ లో భారత్ ను నమ్మించి మోసం చేసింది. అదే విధంగా ఎన్నో సార్లు దొంగ దెబ్బ తీసింది. కానీ ప్రపంచ దేశాలకు ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ బుద్ధి తెలుస్తుంది. ఒకపక్క రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే మేము భారత లాగే విదేశాంగ విధానం పాటిస్తూ తటస్థ వైఖరి ఉంటున్నామని చెబుతూనే దొంగతనంగా అమెరికా వైపు నుంచి పాకిస్తాన్ తమ ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తోంది.


ఇలా చేయడం వల్ల బ్రిటన్, అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూ అదే సమయంలో రష్యాకు  తెలియకుండా వీటన్నింటినీ సాగిస్తోంది. గత మూడు నెలలుగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ ఆయుధాలను సరఫరా చేస్తుందని ఓ వార్తా సంస్థ బహిర్గతం చేసింది. ఈ విషయంలో పాకిస్తాన్ రహస్యంగా ఆయుధాలను చేరవేయడంపై చర్చ నడుస్తుంది. ఎన్నోసార్లు దొంగ దెబ్బలు తీయడం ఉగ్రవాదులను పెంచి పోషించడం వారికి ఆయుధాలను ఇవ్వడం  ద్వారా జమ్మూ కాశ్మీర్లో దాడులను చేయడం అలవాటైన పని. ఇలాంటి దాడులను భారత్ ఎన్నోసార్లు తిప్పికొట్టింది. కానీ పాక్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రపంచం ఎదుట చూపెట్టింది.


రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు రష్యా కు వెళ్లి వారికి మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం మాజీ అయిపోయారు. ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు మద్దతిస్తూ పరోక్షంగా ఉక్రెయిన్ కు సహాయం చేస్తుంది. కానీ రష్యాకు తెలియకుండా చేయాలని చేస్తుంది. ఈ విషయం రష్యాకు తెలిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలోనే హెచ్చరించారు. ఉక్రెయిన్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందించిన తన నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందే వివిధ దేశాలకు హెచ్చరించారు. మరి పాక్ చేసిన పనికి రష్యా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: