ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ మధ్య నోటి దూల, చేతి రియాక్షన్ వార్ నడుస్తుంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి పరిధి దాటి కొట్టుకునేంత వరకు కూడా వెళుతున్నాయి. గతంలో ఏకంగా టీడీపీ ప్రధాన కార్యాలయంపైనే దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి.


ప్రస్తుతం ఒకరికంటే ఒకరు ఎక్కువన్నట్లు చూసుకుందాం అంటే రండి అనే స్థాయికి రెండు పార్టీల నాయకులు వెళ్లిపోయారు. టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న వైసీపీ నాయకులకు సవాల్ చేస్తూ రండి చూసుకుందాం అంటే గన్నవరంలో ఉన్న వంశీ ఎవరొస్తారో రండి చూసుకుందాం అని సినిమా డైలాగులు వేసుకుంటున్నారు.


టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి వైసీపీ నాయకులపై జగన్ పై గతంలో బూతులతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.  అయితే ఆ సమయంలో ఎలాగోలా తప్పించుకున్నారు. కానీ ప్రస్తుతం జరిగిన దాడిలో బయటపడలేక జగన్ ప్రభుత్వం తో దెబ్బలు తిన్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. పట్టాభిని కొట్టారని టీడీపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం పట్టాబి జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో వర్లరామయ్య, మాణిక్యాల రావు లాంటి వారు కూడా టీడీపీ అధికార ప్రతినిధులుగా పని చేశారు. కానీ ఏం జరిగింది. ఏ పదవి కూడా రాలేదు. దీంతో వారు అధికార ప్రతినిధులుగానే ఉండిపోయారు.


పట్టాబి అనే వ్యక్తి మాత్రం రాజకీయాల్లో ఆటో యూనియన్ల స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి.  ప్రస్తుతం గన్నవరం సీటును పట్టాభి ఆశిస్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగాా పని చేస్తున్న పట్టాభి రాబోయే కాలంలో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. దీని కోసమే ఇంతలా ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పక్కా ప్రణాళికతో మీడియాతో మాట్లాడే పట్టాభి ప్రస్తుతం కేవలం బూతులతో విరుచుకుపడేందుకే వస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్న వార్ తో రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే విషయం ఏదీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: