
భారతదేశంలోని మానవ హక్కుల గురించి అమెరికా వాళ్ళు ఎవరం మాట్లాడడానికి? వాళ్ళకి ఏమైనా ఆదిపత్యం ఇచ్చామా మనం. లేదా వాళ్లకి సామంతులుగా ఏమైనా ఉన్నామా. కానీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అమెరికాకు తోకలా ఉండే యూరోపియన్ యూనియన్ ఏం చేసింది ఇజ్రాయిల్ లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన విషయాలను పరిశీలించమని ఒక ప్రతినిధిని పంపించింది. యూరోపియన్ యూనియన్ ఇజ్రాయిల్ ను శాసించే వ్యవస్థా లేదా దేశమా? ఇజ్రాయిల్ అంతర్గత వ్యవహారాలు వీళ్ళకి ఎందుకు.
అలాగే సౌదీ అరేబియాకు అమెరికా ఒక దమ్కి ఇవ్వడానికి సిద్ధమయింది. అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుల పేరుతో సెనెటర్ల పేరుతో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు వాళ్ళు. ఆ తీర్మానంలో విషయం ఏంటంటే అరబ్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. మహిళలకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, విద్యకు, బయట నుంచి అక్కడ వచ్చే వాళ్లకు కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. దీనిపై దర్యాప్తు జరపాలని బైడెన్ కు ఆర్డర్ వేసింది అక్కడ ఉన్న పార్లమెంట్.
ఎందుకంటే అక్కడ ట్రంప్ వర్గం ఉంది. ట్రంప్ వర్గాన్ని అరబ్బు వాళ్ళు ఈ మధ్యన పట్టించుకోవడం లేదు. అందుకనే ఈ వ్యవహారం. దానికి ఇప్పుడు అక్కడ నుంచి ఎవరైనా పంపిస్తే సౌదీ అరేబియా ఊరుకోదు. నువ్వు ఎవడ్రా పంపించడానికి నా దేశపు అంతర్గత వ్యవహారంలో అంటుంది.