గ్రాడ్యుయేట్ల సీట్లు ఓడిపోయే సరికి వైసీపీపార్టీ ఇచ్చిన ఉద్యోగాల వివరాలు బయటపెట్టింది. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు 34,000, జగన్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినవి 1.6 లక్షలు అని చెప్పింది. అదనంగా 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. పోలీసు శాఖలో 6511, కోర్టులో 3600 ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని చెప్పారు. 38 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ ద్వారా 1.10 లక్షల ఉద్యోగాలు నియమించామని ప్రకటించారు.


2.06 లక్షల మంది వాలంటీర్లు దీనికి అదనంగా నియమించామని ప్రకటించారు.  వాలంటీర్లది ఉద్యోగం కాదని గౌరవ వేతనం అని గతంలో వైసీపీయే చెప్పింది.  కాంట్రాక్టు ఉద్యోగులు 38 వేల మంది నియమించామన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే 1.06 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు వైసీపీ ఇచ్చింది. అసలైన సమస్య ఏంటంటే ఎవరికి వారు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో వస్తున్న మార్పులు గమనించడం లేదు.


ఎవరెన్నీ ఉద్యోగాలు ఇచ్చిన స్టేట్ మెంట్లను నమ్మే పరిస్థితుల్లో గ్రాడ్యేయేట్లు లేరు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతోందని మాత్రమే చెబుతున్నారు. వాలంటీర్లది ఉద్యోగం కాదు. వారిది గౌరవ వేతనం అని చెప్పడంతో అది ఉద్యోగాల కిందకు రాదు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు వైసీపీ ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతుంటారు.


కానీ ఇచ్చినవి మాత్రం 1.6 లక్షలు మాత్రమే.  గతంలో లాగా ఇన్ని ఇచ్చాం, అన్ని ఇచ్చాం అని చెబితే నమ్మి ఓట్లేసే పరిస్థితుల్లో ఎవరూ లేరు. కాబట్టి ఓటమిని అంగీకరించి రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ ఏం చేస్తే గెలుస్తుందనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తద్వారా ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగలుగుతుంది. లేకపోతే మళ్లీ ప్రతిపక్షంలో కూర్చొవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: