ఉక్రెయిన్ పై రష్యా క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతుంది. డొనేట్ స్కో ప్రాంతంలోని పార్క్ స్థలంలో క్లస్టర్ బాంబులను వేసింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు పది అపార్ట్మెంట్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్లస్టర్ బాంబులు అనేవి చాలా ప్రమాదకరమైనవి. క్లస్టర్ బాంబ్స్ ఒక బాంబు 60 బాంబులతో సమానం. 60 బాంబులు 160 బాంబులతో సమానంగా పేలుతాయి.


అయితే ఈ క్లస్టర్ బాంబుల పై నిషేధం ఉంది. వీటిని యుద్ధాల్లో వాడరాదని రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి చెప్పింది. కానీ కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు ఇలాంటి బాంబులను వాడుతున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా భారత్ పాకిస్తాన్ పై ఆధిపత్యం ప్రదర్శించడానికి ఈ క్లస్టర్ బాంబులను ఉపయోగించింది. తద్వారా కార్గిల్ వార్ లో ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందింది.


ప్రస్తుతం రష్యా కూడా ఉక్రెయిన్ పై  క్లస్టర్ బాంబులను విచ్చలవిడిగా ప్రయోగిస్తుంది.  యుద్ధ సమయంలో ఎక్కడ ఎలాంటి బాంబుదాడులు జరుగుతున్నాయి.వాటి సామర్థ్యం ఏంటి, వాటి వినియోగం ఏంటి? అవి ఎలా ఉపయోగిస్తారు. ఏ యుద్ధ సమయాల్లో వీటిని ఉపయోగించారు అనే వివరాలను పత్రికలు రాయడం మర్చిపోతున్నాయి.


ఒకప్పుడు ఇరాక్ గల్ఫ్  దేశాల యుద్ధం జరిగిన సమయంలో అప్పటి పత్రికల్లో ఎక్కువగా బ్యానర్లు యుద్ధం గురించి అక్కడ జరుగుతున్న విధ్వంసకాండ గురించి బాంబులు మిస్సైల్స్ రకాల గురించి ఎక్కువగా విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు వచ్చేవి. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్దం పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. జర్నలిస్టులు కేవలం గల్లీ లీడర్లు, జిల్లా రాష్ట్రస్థాయిలో వార్తలకి ఎక్కువగా పరిమితం అవుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తో అన్ని దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కారణం కేవలం రాజకీయ వార్తలు. ఇక్కడ ఉండే రాజకీయ నాయకుల కోసం మాత్రమే జర్నలిజం చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: