
భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా, భారత సరిహద్దుల్లో సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పారు. తైవాన్ పై యుద్దం చేయడానికి, భారత్ తో సరిహద్దుల్లో తీవ్ర అలజడి రేపేందుకే రష్యా వెళ్లి పుతిన్ తో చైనా చర్చలు జరిపిందని అమెరికా ఆరోపిస్తుంది. దీనికనుగుణంగానే చైనా, భారత్ సరిహద్దుల్లో వేలాదిగా సైన్యాన్ని మోహరించింది. కానీ అలాంటిదేమీ లేదు. కేవలం మేం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, శాంతి యుతంగా ఉండాలని కోరేందుకు వచ్చినట్లు జిన్ పింగ్ తెలుపుతున్నారు.
భారత ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సైన్యం అన్ని విధాలుగా రెడీగా ఉండాలని జై శంకర్ సూచించారు. ప్రస్తుతం చైనా, భారత్ ల మధ్య తవాంగ్ వివాదం నడుస్తోంది. అరుణా చల్ ప్రదేశ్ లోని చాలా భూభాగాలు మాదే అని చైనా వాదిస్తోంది. గతంలో ప్యాంగాంగ్ సరస్సు వద్ద జరిగిన దాడిలో భారత్ ఆర్మీ లోని 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారత్ మూల్యం చెల్లించక తప్పదు. పుతిన్, జిన్ పింగ్ ల కలయిక ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అమెరికా నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. చైనా శాంతిని కోరుకుంటుందా.. లేదా యుద్ధం కంటిన్యూ చేయిస్తుందా చూడాలి.