ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. టిడిపి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందని వైసిపి ఆరోపిస్తుంది. అదే విధంగా ఆ నలుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే సత్తా టిడిపికి ఉందా అని సవాల్ విసురుతున్నారు వైసీపీ నాయకులు. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు ఉంటాయి. ఇలాంటి దూకుడు వ్యూహంతోటే వైసిపి అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు.  


జగన్ కాంగ్రెస్ అది నాయకురాలు సోనియా గాంధీని కాదనుకొని ఆమెకు ఎదురు తిరిగి సొంతంగా కడపలో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎంపీ గా గెలిచి చూపించారు. అప్పుడు జగన్ అనుసరించినటువంటి వ్యూహం ఒక కీలక మలుపు. తాను ఎదురు తిరిగి నిలబడడమే కాకుండా తను పెట్టిన పార్టీలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. 2014 ఎన్నికల్లో దాదాపు 65 ఎమ్మెల్యే స్థానాలను సాధించి తన సత్తా నిరూపించుకున్నారు. అప్పుడు టిడిపి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా  కూడా ఏ మాత్రం బయపడలేరు.  అదే విధంగా 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో  విజయం సాధించారు.


ఆ 151లో ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారనేది అభియోగం. అందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇప్పుడు వైసీపీ మళ్ళీ దూకుడు విధానాన్ని అనుసరిస్తోంది. టిడిపికి ఓటేసినటువంటి ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని వైసిపి డిమాండ్ చేస్తుంది.


ఈ రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో ఒకవేళ ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది. నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి తరఫున గెలిస్తే వైసిపి పని అయిపోయినట్టేనని భావించాలా లేక వైసీపీ తరఫున నిలబెట్టిన ఎమ్మెల్యేలు గెలిస్తే సీన్ ఎలా ఉండబోతుంది అనే చర్చ ప్రస్తుతం ఏపీలో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: