
అపహరించిన రోజే అచ్చెన్నను చంపేసినట్లు సమాచారం. వైఎస్ ఆర్ కడప జిల్లా కు చెందిన దళిత అధికారి ఇలా హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఆయన ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు చొరవ చూపలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 రోజుల తర్వాత ఆయన మృత దేహం బయటపడితే తప్ప పోలీసులు కదలలేదని ఆరోపణలు వచ్చాయి. ఒక జిల్లా అధికారి 12 రోజులుగా కనిపించకుండా పోయిన అనుమానితులను విచారించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు అచ్చెన్న మృతదేహం లభించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు చెప్పకుండా శవ పరీక్ష చేసేశారంటూ వారు ఆరోపిస్తున్నారు.
కానీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా పోలీసులు విచారణ జరపలేదన్నది నిజం కాదని తెలుస్తోంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఒక్కొక్కరిని ప్రశ్నించగా వచ్చినా సమాచారమే డెడ్ బాడీ అక్కడ దొరికడం. కానీ పోలీసులు అనుమానితులను, నిందితులను ప్రశ్నించే ప్రతి విషయం బయట చెప్పడం కుదరదు. ఒక జిల్లాలో ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారంటే నిందితులకు ఏ మాత్రం భయం లేకుండా పోయిందని అర్థం.
దిశ చట్టంలాగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఇలాంటి హత్యలు జరగకుండా ఉంటాయి. అధికారులనే హత్య చేస్తూ కఠిన మైన చట్టాలు లేకపోవడంతో నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలా కాకుండా కఠిన చట్టాలు అమలు చేస్తేనే హత్యలు చేయడానికి నిందితులు భయపడతారు.