మనలో చాలామంది అప్పుడప్పుడు ఆలయాల్లో గుండు గీయించుకుంటూ ఉంటారు. అలాగే బార్బర్ షాప్ లో హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఇప్పుడు కొంతమంది బ్యూటీ పార్లర్ లో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు. అలా అక్కడ కలెక్ట్ అయిన జుట్టు అంతా కూడా మాక్సిమం విగ్గుల తయారీలో ఉపయోగపడుతుందని మనకు తెలుసు.


కానీ ఇలా సేకరించిన జుట్టు 30-40% మాత్రమే విగ్గుల తయారీలో ఉపయోగపడుతుందట. మిగిలింది వేస్ట్ గా పోతుందట. కానీ ఇప్పుడు చాలా దేశాలు ఈ హెయిర్ ని వృధాగా పోనివ్వకుండా కొనుక్కుంటున్నారట. అలా కొనే దేశాలలో ఫిలిప్పీన్స్ ముందు వరుసలో ఉంది. అది ఈ హెయిర్ ని ఏ రకంగా వాడుతుందంటే సముద్రంలో ఒకసారి షిప్పులు బోల్తా పడుతుంటాయి కదా అక్కడ ఆయిల్ లీకై సముద్ర తీర ప్రాంతమంతా విస్తరించేస్తుంది. అలా జరగకుండా దానికి విరుగుడుగా ఈ జుట్టును తీరప్రాంతాలలో పరచడం ద్వారా తీర ప్రాంతాల్లో  స్ప్రెడ్ అవ్వకుండా చేస్తున్నారట.


పాలవాన్ ప్రావిన్స్ దగ్గర తెల్లగా దగదగలాడే వైట్ బీచ్ లు ఉంటాయట. అలాంటివి అక్కడ 16 బీచ్లు ఉన్నాయట. తాజాగా అక్కడ 8లక్షల టన్నుల ఫ్యూయల్ సముద్రంలో కలిసి పోయిందట. దాని ఇంపాక్ట్ కి అక్కడ ప్రాంతంలోని చేపలు, జలచరాలన్నీ చనిపోయిన పరిస్థితుల్లో, అక్కడ వాతావరణం అంతా అసహ్యంగా తయారైన పరిస్థితి ఏర్పడిందట. దాంతో అక్కడ 9నగరాల్లో బీచ్ లలో ప్రవేశాన్ని నిషేధించారు.


300కిలోమీటర్లు ఇలా పాడైపోయిందట అక్కడ. దాంతో అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా బార్బర్ షాప్ కి వెళ్లి తన జుట్టును ఇచ్చేస్తున్నారట. ఎందుకు ఇదంతా అంటే అక్కడ టూరిజం ప్రధాన ఆదాయమట. అక్కడికి 4.8మిలియన్ల టూరిస్ట్ లు వస్తూ ఉంటారట. వాళ్ల మీదనే అక్కడ వ్యాపారాలు కూడా నడుస్తూ ఉంటాయట. చేపలు కూడా వాళ్ళ ఆహారంలో ఒక భాగమే. కాబట్టి ఇవన్నీ లాస్ అవ్వకుండా వాళ్లు స్వచ్ఛందంగా జుట్టును ఈ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: