21 ఏళ్ల కుర్రాడికి అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. అతడు చదివింది కేవలం 10 వ తరగతి, కనీసం ఇంటర్ కూడా చదవలేదు. ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడతాడు. డ్రైవింగ్ లైసెన్సు ఉంది కాబట్టి ఉద్యోగం ఇచ్చారు. కలిసి వీడియో గేమ్స్ ఆడుకునే సమయంలో ఓ పక్కన ఈ పత్రాలను పక్కన పెట్టుకుని మరో పక్క గేమ్స్ ఆడాడు. ఆ సమయంలో ఆ పత్రాలు గేమ్స్ లలో కూడా షేర్ అయిపోయాయి. ఆ గేమ్స్ లో ఉన్న పత్రాలను గమనించిన కొందరు వాటిని ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసేశారు.
దీంతో అమెరికా గుట్టు రట్టయింది. దీంట్లో అమెరికా దర్యాప్తు చేసిన సమయంలో కుర్రాడి విషయం బయటపడింది. కుర్రాడిపై దేశ ద్రోహం కేసు పెట్టింది. ఇందులో భాగంగా 8 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఒక్కో కేసు వెనకాల 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే అమెరికా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అమెరికా రక్షణ శాఖ అత్యంత రహస్యంగా భావించే కీలక పత్రాలు లీక్ కావడంతో మసాచుసెట్స్ లో నివసించే జాక్ ను ఎఫ్ బీఐ అరెస్టు చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి