మాటకు ముందు కమ్మ, వెనుక కమ్మ. ప్రజల్లో కమ్మ సామాజిక వర్గం పైన ఎంత విషం చిమ్మితే, ఎంత విద్వేషం ఎక్కిస్తే నారా చంద్రబాబునాయుడుని ఓడించడం అంత సులభమని భ్రమలో తానుండి, ప్రజలను కూడా అదే భ్రమలోకి నెట్టాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారని చెబుతారు జగన్. కానీ దేవుడు స్క్రిప్ట్ వేరే విధంగా రాశాడని తనకు అత్యంత క్లిష్టమైన పరిస్థితి వచ్చిన ప్రతిసారి జగన్ కమ్మ కులం వారిపై ఆధారపడడం, రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వకపోయినా తమ సొంత రెడ్లలో తిరుగుబాటు మొదలవడం, అది అందరికీ అర్థం అవ్వకపోవచ్చు.
కానీ అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి కేసుల మీదన కోర్టు దూకుడు పెంచినప్పుడు జాస్తి చలమేశ్వర రావు గారి కొడుకు జాస్తి భూషణం చౌదరిని తన న్యాయ సలహాదారుగా పెట్టుకుని ఢిల్లీలో అవసరమైన ప్రతి గడపతొక్కడం తన సొంత పార్టీ రెడ్డిలకే ఆశ్చర్యం కలిగించింది. కట్ చేస్తే అవినాష్ కేసు ముందుకు వచ్చిన వేళ మళ్లీ అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన చింతా శశిధర్ అనే పారిశ్రామికవేత్త ద్వారా పెద్ద పావులే కదుపుతున్నట్టుగా మీడియా కోడై కూస్తుంది.
కొసమెరుపు ఏంటంటే రోజూ ఎవరి మీద అయితే ఆయన విషం చిమ్ముతూ ఉంటారో ఆ రామోజీరావు గారి దగ్గరి దూరపు బంధువే ఈ చింతా శశిధర్ అని సమాచారం తెలుస్తుంది. ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయ శత్రు వర్గం అని అనుకుంటారో చివరికి వాళ్లే ఆయనకి అవసరమవుతుండడం ఒక విచిత్రం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి