
యాక్చువల్ గా ఇన్కమ్ టాక్స్ ఇప్పుడు భారీగా పెరిగింది. జీఎస్టీ పెరిగింది ఇంకా ఇన్కమ్ టాక్స్ ఆదాయం కూడా పెరిగింది. ఈ ఆదాయంతో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి నిధుల కోసం వెతుక్కోవలసిన అవసరం ఉండదు. మొన్నటి వరకు అవసరానికి నిధులు వెతుక్కోవలసిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు చేతులు తిరుగుతుండడంతో ప్రజాప్రయోజన కార్యక్రమాలు గట్టిగా చేయడానికి కుదురుతుంది అని తెలుస్తుంది.
నిజానికి ఈ ఆదాయం వల్లే రోడ్లు వేస్తున్నారు ఇంకా 85 కోట్ల మందికి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రైతులకు 6000 రూపాయలు వేస్తున్నారు. ఇంకా ఎరువులకి ₹2,000 సబ్సిడీ కూడా ఇవ్వగలుగుతున్నారు ఈ ఆదాయం వల్లే. అయితే ఇప్పుడు ఆర్థికవేత్తలు చెప్పేది ఏమిటంటే ప్రజలకు పన్నుల భారం పెరిగిపోయింది దాన్ని తగ్గించండి అని. ఆదాయపు పన్ను మరింతగా తగ్గాల్సిన పరిస్థితి ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త సుజిత్ సింగ్ బర్నాల అన్నారని తెలుస్తుంది.
అత్యధిక ఆదాయం పొందుతున్న వాళ్లపై గరిష్టంగా 40 శాతం వరకు పన్నుల భారం పడుతున్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. కార్పొరేట్ పన్నులా, వ్యక్తిగత ఆదాయపన్ను కూడా 25% మించకూడదని ఆయన అన్నారు. మనది పేద దేశం అయినా సరే పన్నుల వసూలు మాత్రం ఎక్కువగానే ఉందని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల పనులన్నీ కలిపి జిడిపిలో 19% ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు.