దేశంలో  ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి చాలా మందిని అరెస్టు చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో బయటపడిన లింకుల ఆధారంగా కొంతమంది వ్యక్తులను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యంగా  పీఎఫ్ఐ అనే ఉగ్రవాద సంస్థ ఏకంగా ఉగ్రవాద క్లాసులు చెబుతూ కొంతమంది యువతను పక్కదారి పట్టిస్తున్నట్లు విచారణలో తేలింది.


పీఎఫ్ఐ సంస్థ ముస్లింలోని కొంతమంది యువతను కావాలనే రెచ్చగొట్టి వారికి తీవ్రవాద పాఠాలు నేర్పిస్తూ ద్వేషం కలిగేలా చేస్తోంది దీని వల్ల యువత దేశం గురించి చెడు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా భాగ్యనగరంలో దాడులు చేయడానికి ప్రణాళికలు వేసిన వారిని ఎన్ఐఏ ఇప్పటికే చాలా సార్లు పట్టుకుంది. ఇలా పట్టుకుంటున్న తరుణంలో ఎంతోమంది యువతను టార్గెట్ చేసి వారికి శిక్షణ ఉగ్రవాదం వైపు అడుగులు వేేసేలా చేస్తున్నారు. పీఎఫ్ఐ అనే సంస్థ కూడా ఇలాగే యువతను పక్కదారి పట్టిస్తోంది.


ఎన్ఐఏ చాలా కేసుల్లో ఎంతో మంది ఉగ్రవాద అనుకూల వ్యక్తులను అరెస్టు చేస్తోంది. స్లీపర్ సెల్స్ ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. కళ్ల ముందే అందరితో చక్కగా మాట్లాడే వారు. ఉగ్రవాదుల అని తెలుసుకుని కూడా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. కేవలం పోలీసులే నిఘా పెట్టి అందర్ని రక్షించాలి. మనకేం సంబంధం లేదు. సమాజం ఏమైపోయినా పర్లేదు. మనం బాగుంటే చాలు.. మిగతా విషయాలు మనకు అనవసరం అనుకుంటూ జీవించేస్తున్నారు.


ఇలా చేయబట్టే గతంలో హైదరాబాద్ లోనే కాదు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగి చాలా మంది అమాయక ప్రజలు మరణించారు. మరీ దేశం బాగుండాలంటే పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తిస్తే చాలు. పోలీసులకు సహకరిస్తూ ఉండాలి. పిల్లలన పెంచే సమయంలో కూడా దేశభక్తి పాఠాలు, స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలియజేయాలి. వారి త్యాగాలను వివరించే ప్రయత్నం చేసి దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా మలచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: