జర్మనీ కూడా వ్యతిరేకంగానే ఉంది. నాటో చీఫ్ మారబోతున్నారు. నాటో లో చీలికలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి విడిపోయిన మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం నాటో చీఫ్ పదవి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. ఉక్రెయిన్ లాంటి పరిస్థితి తమకు రాకుండా ఉండాలంటే నాటో సైనికాధ్యక్ష పదవి తమకే ఉండాాలని భావిస్తున్నాయి.
రష్యా కు దగ్గర అయి ఉండి. ఒకప్పటి రష్యాలో అంతర్భాగం అయినా దేశానికి ప్రాతినిధ్యం వహించేలా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ తమ దేశానికి సంబంధించిన వ్యక్తినే నాటో చీఫ్ గా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుత నాటో చీప్ స్టోలెన్ బర్గ్ పదవీ కాలం పూర్తవుతోంది. దీనికి సంబంధించి ఆయా దేశాలు తమ దేశం నుంచి నాటో చీఫ్ ఉండాలంటే తమ దేశం నుంచి అని పోటీ పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో స్టోలెన్ బర్గ్ చివరకు స్వీడన్ దేశాన్ని అయినా నాటో లో చేర్చుకోవాలని కోరుతున్నారు.
కానీ చాలా రోజుల నుంచి టర్కీ, హంగేరీ లాంటి దేశాలు స్వీడన్ నాటో లో చేరడాన్ని చాలా తప్పుబడుతున్నాయి. ప్రస్తుతం నాటో లో 31దేశాలు ఉన్నాయి. నాటో లో ఏ దేశం చేరినా ఆ దేశ భద్రతకు ఎలాంటి ముప్పు పరిణమించినా మిగతా 30 దేశాలు తమ దేశానికి ముప్పు వచ్చినట్లుగా భావించి పోరాడాల్సి ఉంటుంది. అందుకే ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధం మొదలైనప్పటి నుంచి నాటో చేర్చుకోమ్మని పదే పదే అడుగుతున్నాడు. ఈ సారైనా ఉక్రెయిన్ ను నాటో చేర్చుకుంటారో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి