చంద్రబాబు నాయుడు హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేసినటువంటి ఐ వై ఆర్ ప్రస్తుతం ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. అందులో అది కూడా తక్కువ కాలం వస్తే ముఖ్యమంత్రులతో ఆ పదవీ కాలాన్ని పొడిగించుకుంటారు. అలా ఐ వై ఆర్ చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా పని చేసి రిటైర్డ్ అయి ఆ తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ కు చైర్మన్ అయ్యారు.


అనంతరం జరిగిన కొన్ని ఘటనల కారణంగా ఆయన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా టిడిపి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కొన్ని కామెంట్లకు ఆయన వ్యతిరేకంగా సింబల్స్ పెట్టడం కామెంట్లు రాయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం జరిగిన పరిణామాలు ఐ వై ఆర్ చంద్రబాబు నాయుడు కి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడారు దాని కొనసాగించారు మేధావుల సభల్లో ఇతర సమావేశాల్లో చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలు 2019 ఎన్నికల్లో జగన్ గెలుపుకు చంద్రబాబు ఓటమికి ఒక కారణమయ్యాయి అని చెప్పొచ్చు.


కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన సొంత చరిష్మాతో గెలిచానని అనుకుంటారు. అయితే టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడం.. తుడా చైర్మన్ గా చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ని నియమించడంతో ఐ వై ఆర్ మండిపడ్డారు. చంద్రబాబు కనీసం ఆయా పదవుల్లో కాస్త సమతుల్యత పాటించేవారు. అని వైఎస్ జగన్ వచ్చిన తర్వాత మొత్తం రెడ్లకి పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. అంటే దీని అర్థం చంద్రబాబు సమర్ధులతో పాటించేవారని కనీసం జగన్ దాన్ని కూడా మరిచిపోయి మరి దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీంతో ఐ వై ఆర్ చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడినట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: