
ఇందులో ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, లోకేశ్, గంటా, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, దేవినేని ఉమ, తెనాలి శ్రవణ్ కుమార్, గుమ్మడి సురేశ్, మండల ఎస్ కోటేశ్వరరావు రియల్టర్, మండల రాజేందర్, దేవినేని రమేశ్, కేవీపీ అంజనీ కుమార్, బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్, హరేంద్ర నాథ్ చౌదరి, దోనేపూడి దుర్గా ప్రసాద్ రియల్టర్లు ఉన్నారు. అయితే ముందుగానే వీరందరికీ అక్కడ అసైన్డ్ భూముల ధరలు పెరుగుతాయని సమాచారం ఉందని తెలుసుకున్నారు.
దీంతో అక్కడ భూముల ధరలను అమాంతం పెంచేశారని తెలుసుకున్నారు. 17 (ఏ) అంశం ఒకే అయితే వీరందరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 17 (ఏ) రాకపోతేనే మాత్రం అసలు సమస్య ప్రారంభమతుంది. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో బెయిల్ రాకుండా చేయాలని జగన్ సర్కారు కుట్ర పన్నుతోందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ సమస్య గురించి అవినీతి జరగలేదని, అవాస్తవమైన కేసు అని ఎవరూ మాట్లాడటం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు , ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి భూముల కుంభకోణం ఇలా ఒక్కో కేసు నుంచి బయటపడాలంటే అంతా ఈజీ కాదు. కానీ ఇలాంటి ఉపద్రవం టీడీపీకి సరిగ్గా ఎన్నికల ముందు రావడం ఇబ్బందికరంగా తయారయ్యింది.