స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకి తిప్పలు తప్పడం లేదు.  ప్రస్తుతం ఆయన రెగ్యులర్ బెయిల్ పై బయట ఉన్నారు. దీంతో ఈ కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది ఇక చంద్రబాబుని టచ్ చేసే వారు లేరు అని టీడీపీ నాయకులు భావించారు. దీనికి ప్రాథమిక ఆధారాలు లేవంటూ టీడీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఈ కేసుకు సంబంధించిన ఓ కీలక వ్యక్తి అప్రూవర్ గా మారారని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు  చేసింది.


చంద్రబాబు బయటకి వచ్చిన తర్వాత ఆయన రాకపోవడం ఇదంతా టీడీపీ అధినేత స్కెచ్ అని ఆ పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకున్నారు.  తమ అధి నేత ఎత్తుకు పై ఎత్తు వేశారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక కేసు ముగిసి పోయింది అని భావిస్తున్న తరుణంలో సీఐడీ ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో ఏ 13 నిందితుడిగా ఉన్న చంద్రకాంత్ షా తాను అప్రూవర్ గా మారుతున్నట్లు కోర్టుకు తెలిపారు. మంగళవారం కోర్టులో హాజరైన ఆయన అప్రూవర్ గా మారుతున్నానని చెప్పారు. తదుపరి విచారణను కోర్టు జనవరి 5కు వాయిదా వేసింది.

చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ ను జనవరి 5న ఏసీబీ కోర్టు రికార్డు చేసే అవకాశం ఉంది. షెల్ కంపెనీలు, బోగస్ ఇన్ వాయిస్ ల ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం జరిగింది అనేది ప్రధాన ఆరోపణ.  ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులతో పాటు కొన్ని కంపెనీల ప్రతినిధులపై కూడా అభియోగాలున్నాయి. ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా పై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన 13వ నిందితుడిగా ఉన్నారు. ఆయనే ఇప్పుడు అప్రూవర్ గా మారుతానని కోర్టుకు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: