జమ్మూ కశ్మీర్ లో ఇటీవల తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ అయ్యాయి. పౌరుల మరణాలు.. ఎదురుకాల్పుల్లో జవాన్లు చనిపోవడం.. ఉగ్రవాదుల ఏరివేత.. ఇలా కార్యక్రమాలు పెరిగాయి. పాక్ ఉగ్ర సంస్థలు ఎక్కువగా పూంచ్ నే లక్ష్యం చేసుకున్నారని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. గత వారం ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేయడంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారు.


అయితే పాకిస్థాన్ చేసే ప్రతి పని వెనుక చైనా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్థాన్ లాంటి దేశాలకు అండగా ఉండటం.. తర్వాత ఏం తెలియనట్లు డ్రామాలు ఆడటం డ్రాగన్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. పాక్ సాయం చేసే దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంటుంది. మరోవైపు ఇండియా సరిహద్దు భూ భాగాలన్నింటిని చైనా తమ దేశ భూ భాగాలుగా చెబుతూ ఉంటుంది. దీంతో భారత సైనికులు మూడేళ్లుగా సరిహద్దుల్లో ఎక్కువగా గస్తీ కాస్తున్నారు. ఇండియన్ ఆర్మీ దృష్టి మరల్చడానికే కశ్మీర్ లోని పూంచ్ వైపు ఎగదోస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


చైనా భారత్ తో యుద్ధం నేరుగా చేయదు. కానీ వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. అందులో భాగంగా పాక్ ను పావుగా వాడుకుంటుంది. పాకిస్థాన్  మనతో యుద్ధం చేయకున్నా పరోక్ష యుద్ధం చేస్తూ ఉంటుంది. నేరుగా భారత సైన్యాన్ని ఢీకొట్టే శక్తి సామర్థ్యాలు పాక్ కు లేవు. అందుకే ఉగ్రవాద సంస్థలను అడ్డుపెట్టుకుని ఇండియాలో అక్రమ చొరబాట్లు, భారత సైనికులపై దాడి వంటివి చేస్తుంటుంది.


ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి దేశ సరిహద్దుల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో  దేశ రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశ సరిహద్దుల్లో సైనిక మోహరింపులు ఎక్కువగా జరిగాయి. రక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు. హమాస్ తీవ్రవాదుల మీద జరుగుతున్న దాడి లాంటిదే భారత్ లోను చేస్తామని పాకిస్థాన్ హెచ్చరిస్తున్న వేళ మన సైన్యం మరింత అప్రమత్తం కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: