ఒక చిన్న కమర్షియల్ యాడ్ ఎలా పెద్ద చర్చకు దారి తీస్తుందో తాజాగా మరోసారి నిరూపితమైంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి నటించిన కాఫీ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ యాడ్‌లో ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణంగా ఒక యాడ్ అంటే తేలికగా తీసుకునే ప్రేక్షకులు కూడా, ఈ జంట మధ్య ఉన్న సహజమైన హావభావాలు, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటివరకు విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్ననే బెస్ట్ అని భావించిన అభిమానులు కూడా ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. శ్రీలీలతో విజయ్ కనిపించిన తీరు మరింత ఫ్రెష్‌గా, ఆకర్షణీయంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న చలాకీతనం, నేచురల్ బాండింగ్ యాడ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ యాడ్ చూసిన తర్వాత, ఈ జంటను పెద్ద తెరపై కూడా చూడాలని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఒక సినిమా మొత్తం ఈ ఇద్దరి చుట్టూ తిరిగితే ఎలా ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే “విజయ్-శ్రీలీల మూవీ ఎప్పుడొస్తుంది?” అనే చర్చలు మొదలయ్యాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త కాంబినేషన్లకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి సమయంలో ఈ జంటపై పెరిగిన ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, ఏదైనా దర్శకుడు లేదా నిర్మాత ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకువస్తే, అది ఖచ్చితంగా ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఈ వైరల్ యాడ్‌తో మొదలైన ఈ హైప్ నిజంగా సినిమాగా మారుతుందా? అభిమానుల కోరికను ఎవరు నెరవేర్చుతారు? అనేది చూడాల్సి ఉంది. అందరు ఇప్పుడు ఒక్కటే అంటున్నారు. శ్రీలీలకి ఒక రెండు మూడు హిట్లు పడితే రష్మిక ని వెనక్కి నెట్టే రేంజ్ కి వెళ్లిపోతుంది ఈ బ్యూటి అని..చూడాలి మరి ఏం జరుగుతుందో..??



మరింత సమాచారం తెలుసుకోండి: