
ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మస్క్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మస్క్ అనేక సబ్సిడీలు పొందారని, వాటి పారదర్శకతను పరిశీలించాలని అన్నారు. మస్క్ లేకున్నా అమెరికా ప్రభుత్వం నడుస్తుందని, తన తప్ప ఎవరూ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్‌తో సంప్రదింపులు జరపడం లేదని, అతని మానసిక స్థితి సరిగా లేదని ట్రంప్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వారి మధ్య గురి మరింత పెరిగేలా చేశాయి.
మస్క్ తొలుత ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన పోస్ట్‌ను తొలగించారు. ఎప్‌స్టైన్ కుంభకోణంలో ట్రంప్ పేరు ఉందని, దర్యాప్తు వివరాలు బహిర్గతం కాలేదని మస్క్ ఆరోపించారు. ఆ పోస్ట్‌ను తర్వాత తొలగించినప్పటికీ, వివాదం ఆగలేదు. రిపబ్లికన్ నాయకులు ఈ ఘర్షణను సర్దుబాటు చేయాలని కోరారు, కానీ ఇద్దరూ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ట్రంప్ మస్క్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. డెమోక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అన్నారు. మస్క్ కొత్త పార్టీ స్థాపన గురించి 80 శాతం అమెరికన్లు సమర్థిస్తున్నారని పోల్‌లో పేర్కొన్నారు. అయితే, మస్క్‌కు అధ్యక్ష పదవికి అర్హత లేదు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు