- ( అమ‌రావతి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారిన అంశం మంత్రివర్గ విస్తరణ. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాక‌పోయినా సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశాల్లో మంత్రులకు ఇచ్చిన హెచ్చరికల ద్వారా మంత్రివర్గ మార్పులు ఖాయమన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కార్యకలాపాల్లో మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదన్న అసంతృప్తిని చంద్రబాబు ఎన్నో సార్లు ఓపెన్‌గానే చెపుతున్నారు. ఇటీవలి కేబినెట్ సమావేశంలోనే, పనితీరు లేకపోతే పక్కకు పెట్టడానికి వెనుకాడనని చెప్పడం ద్వారా చంద్రబాబు మంత్రి వ‌ర్గంలో మార్పులు త‌ప్ప‌వ‌ని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో జనసేనకు మరో మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం, బీజేపీ కూడా ఒక స్థానం కోరుతున్న సందర్భంలో, కొన్ని మంత్రులను పక్కకు పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నదే చంద్రబాబు తాజా ఆలోచనగా తెలుస్తోంది.


ప్రస్తుతం వచ్చిన సమాచారం మేరకు 3 నుంచి 4 మంది టిడిపి మంత్రులను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. అనంతపురం, గోదావరి జిల్లాల్లోని మంత్రుల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారి స్థానాల్లో బలమైన, ప్రజలలో ఆదరణ ఉన్న, వైసీపీపై గళం ఎత్తగల నాయకులను తీసుకొచ్చే దిశగా చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నవారిలో ఎంపీ రఘురామ కృష్ణరాజు పేరు టాప్ లిస్ట్‌లో ఉంది. గతంలో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, ఆ తర్వాత జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఓ ఫైర్ బ్రాండ్‌గా మారిన సంగతి తెలిసిందే. తన బలమైన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి కౌంటరులిచ్చిన రఘురామకు పార్టీ మారిన తరువాత చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


విశాఖపట్నం నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. గతంలో కూడా మంత్రి పదవిలో ఉన్న ఆయనకు తిరిగి అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు సమర్థంగా సమాధానం చెప్పగల నాయకులు మంత్రివర్గంలో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహం. పునర్విభజన ఆలస్యం, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వచ్చే రోజుల్లో కూటమి రాజకీయాలను సమర్థంగా నడిపించాలంటే, బలమైన నాయకుల అవసరం తప్పదు. ఈ నేపథ్యంలో వచ్చే మంత్రివర్గ విస్తరణలో జనసేన, బీజేపీలకు స్థానం కల్పించడంతో పాటు ఫైర్ బ్రాండ్ నేతలకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: