రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సహకారం పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో ముఖ్య అడుగుగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఈ సందర్శనను రేవంత్ రెడ్డి పంపిన రాయబారంగా అభివర్ణిస్తున్నారు.కోమటిరెడ్డి చంద్రబాబు విజన్ 2020ను ఎంతో ప్రశంసించారు. ఆ విజన్ ప్రతిరూపంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. అదే విధంగా అమరావతిని ఫ్యూచరిస్టిక్ రాజధానిగా తీర్చిదిద్దుతున్న చంద్రబాబు దూరదృష్టికి మరోసారి మెచ్చుకోలు తెలిపారు.
ఈ మాటలు రెండు రాష్ట్రాల నాయకుల మధ్య గతంలో ఉన్న చేదు అనుభవాలను మరచి ముందుకు సాగాలనే సంకేతంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ సమిట్ వంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొనడం ద్వారా పెట్టుబడులు సహకారం పెరుగుతాయని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.గతంలో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల గురించి కోమటిరెడ్డి స్పందించారు. అప్పటి పరిస్థితుల్లోనే ఆ మాటలు ఆడానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య స్నేహ బంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు గత వివాదాలను పక్కన పెట్టి కొత్త అధ్యాయం ప్రారంభించాలనే సందేశంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ఈ మాటలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్శనం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం కొత్త ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి చొరవతో జరిగిన ఈ రాయబారం రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల ఫలితాలు ఇస్తుందని రాజకీయ పరిశీలకులు ఆశిస్తున్నారు. రైజింగ్ సమిట్ లో చంద్రబాబు పాల్గొంటే రెండు రాష్ట్రాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి