కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా మెచ్చుకున్నారనే వార్త  తెలుగు దేశం పార్టీ అనుబంధ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండిగో విమానయాన సంస్థ వ్యవహారంలో రామ్మోహన్ నాయుడు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకున్నారని, శాఖాపరంగా వేగంగా అడుగులు వేశారని ప్రధాని ఓ కార్యక్రమంలో రామ్మోహన్‌కు కితాబు ఇచ్చి అభినందించారని ఆ వార్తలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగాలని మోదీ సూచించారనే ప్రచారం జోరుగా సాగిందోంది.

అయితే ఈ వార్త నిజమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. జాతీయ మీడియాలోనూ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఎక్స్ ఖాతాలోనూ ఈ మెచ్చుకోలు గురించి ఒక్క మాట కనిపించడం లేదు. గతంలోనూ టీడీపీ అనుబంధ మీడియా ఇలాంటి అతిశయోక్తి వార్తలు ప్రచారం చేసిన నేపథ్యంలో ఈసారి కూడా అదే పద్ధతి అనుసరించారనే విమర్శలు ఉన్నాయి.

రామ్మోహన్ నాయుడు ఇండిగో సమస్యలో తీసుకున్న నిర్ణయాలు వాస్తవంగా ప్రశంసార్హమే అయినా, వాటిని ప్రధాని స్వయంగా మెచ్చుకున్నారని చెప్పడం అతిగా అనిపిస్తోంది. ప్రధాని ఇచ్చిన కితాబు ఫోటో కూడా ఎక్కడా కనిపించకపోవడం, కార్యక్రమం ఎక్కడ జరిగిందనే సమాచారం లేకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కథలు సృష్టించడం కొత్త కాదని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని కార్యాలయం నుంచి స్పష్టత వస్తేనే ఈ వార్త నిజమో కాదో తేలనుంది. అప్పటిదాకా ఈ మెచ్చుకోలు కేవలం పార్టీ ప్రచారంలో భాగమని భావించడమే సబబుగా కనిపిస్తోంది.


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: