ఈ ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు అంచనా. దక్షిణ భారత రాష్ట్రాల్లో తెలంగాణకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు కూడా సమాన అవకాశాలు ఉన్నా, ప్రస్తుత పరిస్థితులు తెలంగాణను ముందుంచుతున్నాయి.ఈ పెట్టుబడి AI ప్రథమ భవిష్యత్తును వేగవంతం చేయడానికి ఉద్దేశించబడింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే కొత్త డేటా సెంటర్ భారతదేశంలోనే అతిపెద్ద హైపర్‌స్కేల్ రీజియన్‌గా మారనుంది. 2026 మధ్యలో ఇది పని ప్రారంభించనుంది.
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్‌లో పెద్ద స్థాయిలో ఉంది. ఐటీ రంగంలో 20 మిలియన్ మంది భారతీయులకు AI నైపుణ్యాలు అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు, రీసెర్చ్ హబ్‌లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం AI పార్క్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా పెట్టుబడులు ఆకర్షిస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడ, విశాఖపట్నంలో ఐటీ హబ్‌లు అభివృద్ధి చేస్తున్నా, మైక్రోసాఫ్ట్‌తో ఇప్పటి వరకు పెద్ద ఒప్పందాలు కుదరలేదు. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదుగుతున్నా, మైక్రోసాఫ్ట్ ప్రాధాన్యతలు హైదరాబాద్‌పైనే ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఉద్యమకాలం నుంచి కొనసాగుతున్నా, తెలంగాణ ఐటీ పార్కులు, స్కిల్ హబ్‌లు దీనికి బలం. అయితే సీఎంగా చంద్రబాబు ఉన్నందున ఏమైనా జరగొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. చూడాలి మైక్రోసాఫ్ట్ ఏ రాష్ట్రాన్ని ఎంచుుకంటుందో?
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి