2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరిగి సినీ రంగ ప్రవేశం చే యడంతో.. దీనిపై కినుక వహించిన జేడీ లక్ష్మీనారాయణ .. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంత రం.. సొంత కుంపటి పెట్టుకున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాలు కూడా పెట్టారు. కానీ, ఆయన ప్రయత్నం ఫలించలేదు. 2024లో కొన్ని స్థానాలకు పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. ఆయన కుమార్తెను కూడా బరిలో నిలిపారు. ఆమె కూడాఓడిపోయారు.
ఇక, ఆ తర్వాతపెద్దగా ప్రజల మధ్య కనిపించని లక్ష్మీనారాయణ తెరవెనుక.. కాంగ్రెస్ పార్టీలో చేరే విష యంపై ప్రయత్నాలుముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సొంతగా పార్టీని ముందుకు నడిపించే శక్తి కనిపించడం లేదని.. అందుకే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని.. తద్వారా కాంగ్రెస్ తరఫున వచ్చే ఎన్నికల్లో పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని జేడీ భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు జేడీ ఇమేజ్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చర్చ సాగుతోంది.
తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా.. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను జేడీ కోరుకుంటున్నట్టు సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. సహజంగానే.. పార్టీ విలీనం చేసిన వారికి కాంగ్రెస్ కూడా పదవులు ఇస్తోంది. అంతో ఇంతో ఇమేజ్ ఉన్న జేడీ.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ కావాలని యోచిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, పారదర్శక వ్యక్తి అనే ఈ రెండు ఇమేజ్‌లు సొంతం చేసుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏమేరకు అవకాశం ఇస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి