దేశంలో ఇప్పటికే చాలా యూనివర్సిటీలు కోర్సుల ప్రవేశ కోర్సుల కోసం అన్నీ రంగం సిద్దం చేసింది.. ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం వాటి ఫలితాలను కూడా విడుదల చేసింది.. అందుకు సంబంధించిన కొన్ని కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు.. కాగా, ఇప్పుడు ఎల్ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ను కూడా ప్రభుత్వం చేపట్టారు. దేశంలోని ప్ర‌ముఖ యునివ‌ర్సిటీలు, లా స్కూల్స్‌లో వచ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఎల్ఎల్‌బీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఎల్‌శాట్ ఇండియా నోటిఫికేష‌న్‌ను లా స్కూల్ అడ్మిష‌న్ కౌన్సిల్ విడుద‌ల చేసింది.. 



2021 ఏడాది ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ అందుబాటులో ఉంటుందని అంటున్నారు.ప్ర‌వేశ ప‌రీక్ష‌ మే 10, 2021 నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించింది.. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత‌ప‌రీక్ష ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారితంగా జరగనుంది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా బీఏ ఎల్ఎల్‌బీ, బీఏ ఎల్ఎల్‌బీ ఆన‌ర్స్‌, బీకామ్ ఎల్ఎల్‌బీ, బీకామ్ ఎల్ఎల్‌బీ ఆన‌ర్స్‌, బీబీఏ ఎల్ఎల్‌బీ, బీబీఏ ఎల్ఎల్‌బీ ఆన‌ర్స్‌, బీటెక్ ఎల్ఎల్‌బీ, బీఎస్సీ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది..



ఈ పరీక్షలు కోసం విద్యార్థుల తెలుసుకోవాల్సిన సమాచారాన్ని అందిస్తున్నారు..అందుకోసం సంబంధిత వెబ్ సైట్లలో పొందుపరిచారు. ముఖ్య సమాచారాన్ని కూడా అందిస్తున్నారు.. ఈ కోర్సులకు సంబంధించిన సమాచారం ఇదే..


ప్రవేశానికి సంబందించిన కోర్సులు..


ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ, మూడేళ్ల ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం తదితర కోర్సులు.

ఈ పరీక్షలకు కావలసిన అర్హతలు..

ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సుకు ఇంట‌ర్ లేదా త‌త్స‌మాన కోర్సులో ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంది. ఎల్ఎల్బీ కోర్సుకు డిగ్రీ, ఎల్ఎల్ఎం కోర్సుకు ఎల్ఎల్‌బీ పూర్తిచేయాల్సి ఉంటుంది.


పరీక్షలకు ఎంపిక విధానం..

 ‌రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తారు‌.
పరీక్ష విధానం: ఇందులో అన‌లిటిక‌ల్ రీజ‌నింగ్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్ విభాగాలు ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివ‌రితేదీ: 2021, ఏప్రిల్ 20

అడ్మిట్‌కార్డులు: ఏప్రిల్‌లో

ప్ర‌వేశ‌ప‌రీక్ష‌: మే 10 నుంచి

వెబ్‌సైట్‌:https://www.discoverlaw.in/ లేదా https://discoverlaw.excelindia.com/LSAT/

 ఏదైనా సమాచారం కావాలంటే పైన తెలిపిన వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.. 




మరింత సమాచారం తెలుసుకోండి: