స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు బాగా డిమాండ్ వుంది. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ కోర్స్ నేర్చుకోండి.ఇక న్యూ ఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా వివిధ రీజియన్లలో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన మొత్తం 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌ (10+2) లేదా తత్సమాన కోర్సులో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంకా అలాగే స్టెనోగ్రఫీ సర్టిఫికెట్‌ కూడా ఉండాలి. ఇంకా అభ్యర్ధుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి15 ఏళ్లు ఇంకా ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 నుంచి 8 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది.


అయితే ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 26, 2023వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 27 వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇక దరఖాస్తు సమయంలో జనరల్‌ కేటగిరి అభ్యర్ధులు రూ.700లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకి అయితే ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల దాకా జీతంగా చెల్లిస్తారు. ఇక మీరు ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో దీనికి సంబంధించి పూర్తి వివరాలని చెక్‌ చేసుకోవచ్చు.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: