భారతదేశంలో ఒకప్పుడు  చదువు అనేది సంపన్న కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేది.. కానీ పోను పోను టెక్నాలజీ పెరిగి ప్రతి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు వచ్చాయి. దీంతో చాలామంది పిల్లలు చదువుకుంటూ మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియా లో చదవడం కాకుండా చాలామంది విద్యార్థులు పై చదువుల కోసం విదేశాలకు కూడా వెళ్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తున్నారు.. అయితే మన దేశం నుండి ఇతర దేశాలకు ఎంతమంది విద్యార్థులు పై చదువుల కోసం వెళ్లారు వారు ఏ దేశాలకు ఎక్కువగా వెళ్లారు.. ఏ రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.. అలాగే ఇతర దేశాల నుంచి మన దేశానికి ఎంత మంది విద్యార్థులు చదువుల కోసం వచ్చారు  అనే వివరాలు చూద్దాం.. 

మన దేశం నుంచి కెనడాకు వెళ్లి చదివే విద్యార్థుల సంఖ్య  4,27,000 ఉండగా..అమెరికాకి 3,37,630, బ్రిటన్ కి 1,85,000, ఆస్ట్రేలియా కి 1,22,202, జర్మనీకి 42, 997, యూఏఈ కి 25,000,    రష్యాకి 24,940, కిర్గిస్తాన్ కి 16,500, జార్జియాకి  16, 093, ఫిలిప్పీన్ కి 9665 మంది విద్యార్థులు  వెళ్లి చదువుతున్నారు.అలాగే మన దేశంలో వివిధ రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్లారో చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ నుంచి 35,614, పంజాబ్ నుండి  33,412, మహారాష్ట్ర  నుండి 29, 079, గుజరాత్ నుండి 23,156, ఢిల్లీ నుండి 18,482, తమిళనాడు నుండి 15, 564, కేరళ నుండి 15, 277, కర్ణాటక నుండి 13,699 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుతున్నారు.

 అలాగే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి చదువుకునే విద్యార్థులు చూసుకుంటే.. నేపాల్ నుంచి 13,126 మంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి  3,151 మంది, అమెరికా నుండి 2,893 మంది,  బంగ్లాదేశ్ నుండి 2,608 మంది, యూఏఈ  నుండి 2,287 మంది, భూటాన్ నుండి 1,567 మంది, నైజీరియా నుండి 1387 మంది, టాంజానియా నుండి 1,264 మంది, జింబాబ్వే  నుండి 1058 మంది, సూడాన్ నుండి 982 మంది విద్యార్థులు వచ్చి చదువుతున్నారు.  ఈ విధంగా మన దేశంలో చదువుపై ఎక్కువగా ఆసక్తి పెరగడం వల్ల విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి చదవడం అక్కడి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: