అప్పట్లో ఎక్కువగా పళ్ళు తోముకోవడానికి వేప పుల్ల ఇటుకపొడి వంటివి బాగా ఉపయోగించేవారు. ఈ మధ్యకాలంలో టూత్ పేస్ట్, మౌత్ ఫ్రెషనర్ వంటివి రావడం వల్ల ఉదయం లేవగానే వీటితోనే ప్రతి ఒక్కరు పళ్ళని శుభ్రం చేసుకుంటున్నారు. దీంతో పళ్ళు చిగుళ్ళు గట్టిగా ఉండలేకపోతున్నాయి. అందుచేతనే ప్రస్తుతం ఉన్న వయసు వారికి ఎక్కువగా పళ్ళు ఊడిపోయి చిన్నవయసులోనే ఎమీ తినకుండా అవుతున్నారు. ముఖ్యంగా పళ్ళను శుభ్రం చేయకుండా ఉంటే పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం చిగుళ్ల వ్యాధి వల్ల దంతాలు నోటి ఆరోగ్యం ఇతర సంకేతాలు అలవాట్లు అన్ని కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనంలో తెలియజేశారు. అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ సమర్పించబడిన ప్రకారం దంతాలు చిగుళ్ళను జాగ్రత్త చూసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా చురుకుగా పనిచేస్తుందట. గమ్ వ్యాధి ఇతర నోటి ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులకు ప్రమాద కారణాలని తెలియజేశారు.


అధిక రక్తపోటు వంటివి పరిస్థితులలో ఇలాంటివి ఎక్కువగా ముడిపడి ఉంటాయట. ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని ప్రభావితం చేసినట్టే మెదడు కూడా ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయట. కట్టుడు పళ్ళు ఊడిపోయిన దంతాలు ఉండే వ్యక్తులలో మెదడు ఆరోగ్యానికి చాలా నష్టం జరిగేలా చేస్తుందట. సరిగ్గా పళ్ళు తోముకోకున్నట్లు అయితే దీని ప్రభావం మెదడు పైన పడుతుందట. దీంతో ఆరోగ్యం కూడా క్షేమంగా ఉండేందుకు కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుచేతన ప్రతి ఒక్కరు కూడా బెడ్ కాఫీ వంటివి తాగకుండా ఉండడమే మంచిదని ఉదయం లేవగానే శుభ్రంగా నోటుని శుభ్రం చేసుకొని ఆ తరువాత తమ పనులను చేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. దీంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలియజేయడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: