
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే కాక ప్రపంచంలో తొలిసారి ఆర్చర్ల కోసం ప్రీమియర్ లీగ్ నిర్వహించడం ఆనందంగా వుంది. ప్రతి క్రీడాకారుడిని, ప్రతి ఆర్చర్‌ని మనం ప్రోత్సహించాలి. ఈ ఆటలో ఉన్న ఫోకస్, క్రమశిక్షణ, బలం నిజంగా అభినందనీయమైనవి. ఈ లీగ్ విజయానికి మనమందరం అండగా నిలవాలి. ఆరంభ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు, లీగ్ ఆంథమ్ ఆవిష్కరణ, జట్ల వాక్‌అవుట్లు, రామ్ చరణ్ నేతృత్వంలో జరిగిన రావణ దహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విజనరీ, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అనిల్ కామినేని ఈ కలను నిజం చేయడానికి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, భారత క్రీడా మంత్రిత్వ శాఖలను ఒకచోట చేర్చారు. అతని నాయకత్వంలో, APL కేవలం ఒక క్రీడా లీగ్‌గా కాకుండా ప్రపంచ స్థాయి పోటీలను మిళితం చేసే సాంస్కృతిక వేడుకగా నిలుస్తోంది. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో (అక్టోబర్ 2–12, 2025) లైట్ల మధ్య ఆరు ఫ్రాంచైజీ జట్లు, 36 మంది భారతదేశంలోని అత్యుత్తమ ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ స్టార్లు తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో పోటీ పడుతుండగా, APL భారత క్రీడా రంగానికి కొత్త గుర్తింపుని ఇస్తూ, ఆర్చరీకి ఒక కొత్త దిశ చూపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు