మలబద్ధకంని తగ్గించే న్యాచురల్ టిప్స్?

మలబద్ధకం అనేది సాధారణంగా చాలా మందిలో కనిపించే సమస్య. అందులో ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ఎక్కువగా కూర్చొని పనిచేసేవారు ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు.అయితే ఈ సమస్యని అశ్రద్ధ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా విపరీత పరిస్థితులకు దారితీస్తుంది.సాధారణంగా ఈ సమస్యని చాలా మంది  బయటకు చెప్పడానికి సిగ్గు పడతారు ఇంకా ఆలోచిస్తారు.అయితే కొన్ని జీవనశైలి మార్పులతో మలబద్ధకం సమస్యని చాలా సమర్థంగా నివారించుకోవచ్చు. మీరు జామ పండును ఖచ్చితంగా గింజలతోనే తినేయాలి. ఎందుకంటే ఆ గింజలు మీకు మోషన్‌ ఫ్రీగా అయ్యేలా ఎంతగానో సహాయపడతాయి.ఇంకా అలాగే ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా వెజిటబుల్‌ సలాడ్స్‌ ని తినాలి. అంటే క్యారట్, బీట్‌రూట్, టొమాటో, కీర దోసకాయ ఇంకా అలాగే ఉల్లిని ముక్కలుగా చేసి పచ్చిగా తినాలి.తరువాత మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.


 జామ, ఆరెంజ్, బొప్పాయి ఇంకా ఆపిల్‌ వంటి వాటిల్లో నీటిపాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి.అలాగే మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్‌) ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే పొట్టుతో ఉన్న ధాన్యాలు (జొన్న, రాగి), పొట్టుతో ఉండే గోధువులు, వుడిబియ్యం ఇంకా అలాగే పొట్టుతోనే ఉండే పప్పుధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకాన్ని చాలా ఈజీగా నివారించవచ్చు.అలాగే ప్రతి రోజూ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా మంచిది.అయితే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నవారు మాత్రం డాక్టర్‌ను కలిసి దానికి తగిన కారణాలు కనుగొని, దానికి అనుగుణంగా తగిన మందులు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా కూడా పైన చెప్పిన టిప్స్ ని పాటించండి. తప్పకుండా మీకు ఫలితం కనిపిస్తుంది. ఈ పద్ధతులు పాటించినా కూడా ఈ సమస్య తగ్గకుంటే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: