దంత సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ అంటే మీ దంతాలు, నోరుని పుక్కిలించడం. అంటే మీ నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. అలాగే నోటి ఆరోగ్యం, పరిశుభ్రతను కూడా ప్రోత్సహిస్తుంది. ఆయిల్ పుల్లింగ్ దంత క్షయం, నోటి దుర్వాసన ఇంకా చిగుళ్ల రక్తస్రావం మొదలైన సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి చాలా సహాయపడుతుంది. అయితే ఈ ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు నూనెకు సంబంధించిన లిపిడ్ నిర్మాణం  బ్యాక్టీరియాను చుట్టుముడుతుంది. ఈ సమయంలో నూనెను పుక్కిలించడం వల్ల బాక్టీరియా మృదు కణజాలాల నుంచి వేరుపడి నూనెతో చాలా ఈజీగా జత అవుతాయి. తర్వాత మీరు నూనెను ఉమ్మివేసినప్పుడు చివరకు అది బయటకు వెళ్లిపోతుంది.


ఆయుర్వేద నిపుణులు ప్రకారం మీ దంతాలను బ్రష్ చేయడానికి ఇంకా మీ నాలుకను స్క్రాప్ చేయడానికి ముందు ఆయిల్ పుల్లింగ్ అనేది చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఖచ్చితంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.ఆయిల్ పుల్లింగ్ అనేది మీ దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన నోటి మైక్రోబయోమ్‌ను నిర్వహించడానికి చాలా బాగా సాయం చేస్తుంది.  ఆయిల్ పుల్లింగ్ మీ నోటిలో ఎస్ మ్యూటాన్‌ల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల దంతాల సమస్యలను నివారిస్తుంది.అలాగే మీకు బాగా ఇబ్బంది కలిగించే నోటి దుర్వాసన సమస్యకి ఈ ఆయిల్ పుల్లింగ్ శాశ్వత పరిష్కారం చూపుతుంది. ఇది నాలుక ఇంకా గొంతు వెనుక ఉన్న పొడవైన కమ్మీలలో కనిపించే సల్ఫర్-ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆయిల్ పుల్లింగ్, గార్గ్లింగ్ ఈ బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే ఆయిల్ పుల్లింగ్ వల్ల తాజా, వాసన లేని శ్వాస కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: