
అయితే ఇక్కడ వైద్యులు చేసిన శస్త్ర చికిత్స గురించి తెలిసిన తర్వాత మాత్రం ఇక చరిత్రలోనే ఇది ఒక మిరాకిల్ అని ప్రతి ఒక్కరు అనకుండా ఉండలేరు అని చెప్పాలి. సాధారణంగా తల్లి కడుపులో పెరుగుతున్న శిశువుకు ఏదైనా సమస్య ఉంటే ఇక డెలివరీ అయిన తర్వాతే డాక్టర్లు శిశువుకు ఏదైనా చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక శస్త్ర చికిత్స చేయాలి అంటే తప్పనిసరిగా శిశువు తల్లి కడుపు నుంచి బయటికి రావాల్సిందే. కానీ ఇక్కడ వైద్యులు మాత్రం తల్లి కడుపులో ఉన్న శిశువుకు శస్త్ర చికిత్స చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజంగానే వైద్యులు సాధించారు.
అమెరికాలోని బోస్టన్ లో వైద్యులు ఈ అరుదైన ఘనతను సాధించారు. ఏకంగా తల్లి కడుపులో ఉన్న శిశువుకు శస్త్ర చికిత్సలు చేసి ఔరా అనిపించారు. ఇలా గర్భిణీ కడుపులోని శిశువుకు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ చేసి ఆశ్చర్యపరిచారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. దీంతో మెదడు దెబ్బతినడం గుండె సమస్యలు పుట్టిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని.. అందుకే తల్లి కడుపులో ఉన్నప్పుడే సర్జరీ చేసి ఇక ఇలాంటి సమస్య నుంచి శిశువును బయటపడేలా చేసినట్లు వైద్యులు తెలిపారు.