చలి కాలం మొదలైంది, సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత ప్రారంభం కావడంతో పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన ప్రజలు తొందరగా వారి గమ్మస్థానాలకు చేరుకొంటున్నారు. గత ఏడాది కంటే ఈ సారీ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పలు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడి పోయాయి.
చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు పెరుగుతుంటాయి. చలికి చర్మం పగుళ్లు, పెదాలు, కాళ్ళ పగుళ్లు, పొడిబారిపోవడం, ఎంత మేకప్‌ వేసుకున్నా సరే పగుళ్లతో చర్మం పాడవుతూ ఉంటుంది. ఈ పది టిప్స్ పాటించి మీ చర్మాన్ని చలి నుంచి కాపాడుకోండి.

1. చలికాలంలో ముఖంపై మృత కణాలు ఉంటాయి. వీటిని పోగొట్టాలంటే వారంలో ఒకటి లేదా రెండు సార్లయినా ఫేస్ వాష్‌ను ఉపయోగించి ముఖం కడగాలి. దాంతో మృత కణాలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
2. శీతాకాలంలో ఎక్కువగా చల్లదనం కారణంగా బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు. కానీ అలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. చలిని పోగొట్టుకోవాలంటే గోరు వెచ్చని నీటినే స్నానానికి ఉపయోగించాలి. వేడి నీటి వల్ల చర్మంలో సహజ సిద్ధంగా ఉండే ఆయిల్స్ పోతాయి. దీంతో చర్మం పొడిగా మారుతుంది. ఇక గోరు వెచ్చని నీటితో స్నానం చేసేటప్పుడు అందులో  కొద్దిగా కొబ్బరినూనె వుండేట్టుగా చూసుకోవాలి దానితో చర్మం మృదువుగా మారుతుంది. 


3. విపరీతమైన చలి కారణంగా ఉదయం లేవగానే చర్మం పొడిగా మారుతుంది. దానికి రాత్రివేళ నిద్రపోయే ముందే చర్మానికి పగుళ్ల నివారణ క్రీములు రాసుకుంటే మంచిది. 
4. ఈ కాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు హెయిర్ డ్రయర్లకు దూరంగా ఉండాలి. లేదంటే వెంట్రుకల వద్ద చర్మం పొలుసులుగా లేసి చుండ్రు పెరిగే అవకాశముంది. 


5. ఇక స్నానం చేసిన తరువాత కొందరికి చర్మం పొడిగాను, పెచ్చులుగాను  తయారవుతుంది. దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ గనక రాస్తే సరిపోతుంది. 
6. చలికాలంలో ప్రతి ప్రతిఒక్కరు చేసే తప్పిదం నీటిని సమృద్ధిగా తీసుకోకపోవడం. ఇలా చేయడం తప్పని అంటున్నారు నిపుణులు. రోజూ తగినంత మోతాదులో నీటిని త్రాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో చర్మం మృదువుగా ఉండి తేమను కోల్పోకుండా ఉంటుంది. 


7. విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకున్నా చర్మం మృదువుగా ఉండి.. కాంతివంతంగా మారుతుంది. 
8. హ్యూమిడిటి తక్కువ వుండటం వల్ల పొడి చర్మం చలి కాలంలో సాధారణం అయినా , మరీ వేడి నీటి స్నానం చేయకూడదు. పెట్రోలియం జెల్లీ, క్రీము లు  రాసుకోవడం ద్వారా  చర్మాన్ని రక్షించుకోవచ్చు.


9. గాలి లోని తేమను పీల్చుకోకుండా శరీర ఉష్ణోగ్రత కాపాడగలిగే దుస్తులు ధరించాలి. ఊలు, సిల్క్, పొలిప్రోపిలిన్ దుస్తులు శరీర ఉష్ణోగ్రత నిలుపుతాయి. కాటన్ దుస్తులు వేడిని అంతగా నిలపలేవు.
10. వ్యాయామం చలి కాలం లో మంచి ఫలితం ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: