అన్నం పరబ్రహ్మ స్వరూపం. దీనిని పదిమందికి తృప్తి కలిగేలా పెట్టడం పూర్వజన్మ సుకృతం. ఒకప్పుడు ఎక్కడైనా విందు భోజనంలో మనిషిని కూర్చోబెట్టి వండిన వంటకాలన్నీ అడిగి మరీ అ వడ్డించేవారు. తినేవాడు తర్వాతి కాలంలో సప్లయిర్స్‌ పద్ధతి వచ్చింది. అథితులను విస్తర్ల లెక్కలో వేయడం ఇక్కడే ప్రారంభమైంది. ఎన్ని ప్లేట్ల భోజనం పెట్టాం, ఎంత డబ్బు కట్టాం ఈ లెక్కలతో ఫంక్షన్లలో భోజనం ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఈ దశాబ్దకాలంలో మరో పరిణామం చోటు చేసుకుంది. 

 

ఇక ఇప్పుడంతా బఫేల రాజ్యమే. పెళ్లిళ్లు.. మరే విందైనా ప్లేటు పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఆరగిస్తున్నాం. ఇది ఫ్యాషనో.. మరేం పోకడో గానీ ఇలా తినడాన్ని వెంటనే మానుకుంటే మంచిది. ఎందుకంటే.. నిలబడి తింటే ఆరోగ్యానికి ప్రమాదమేనంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్చుని తినడం వల్ల శరీరం మీద ఒత్తిడి పెరిగిపోతుందని అంటున్నారు. నిల్చుని భోజనం చేసేప్పుడు శరీరంలోని కింది భాగాల నుంచి పైభాగాల వరకు రక్తం సరఫరా కావాల్సి ఉంటుంది. 

 

పై భాగాల వరకు రక్త సరఫరా కావడం కోసం గుండె పంపు చేయాల్సిన వేగం పెరుగుతుంది. తద్వారా గుండె స్పందన రేటు పెరిగి, శరీరంపై ఒత్తిడి పడుతుంద‌ని అంటున్నారు. అలాగే చేత్తో కంచం పట్టుకుని నిలబడి తినేకంటే చక్కగా కూర్చుని తింటే ఆహారం రుచికరంగా ఉంటుందట. కొద్ది నిమిషాలు నిలబడి ఉంటే శారీరక శ్రమ ఎక్కువై.. నాలుక మీద ఉండే రుచిమొగ్గలు సున్నితత్వం కోల్పోయి రుచి తెలియదని ఓ పరిశోధనలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: