నిద్రకు సమయం.. కాలం తెలీదు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అవును అతిగా తిన్నా.. అలసిపోయినా.. నిద్ర దానంత అదే వచ్చేస్తుంది. అస‌లు ఆరోగ్యంగా నిద్ర చాలా అవ‌స‌రం. నిద్రపోవడం అంటే మెదడుకు శక్తినివ్వడం. కంటినిండా నిద్రపోవడం వల్ల బాగా చదవగలుగుతారు, ఆటలు బాగా ఆడగలుగుతారు, సమస్యల్ని బాగా పరిష్కరించుకోగలుగుతారు. అయితే కొంద‌రికి గడియారం గంటలు దాటిపోతుంటాయి కానీ... కునుకు మాత్రం పట్టదు.  ఏ ఒంటిగంటకో మెల్లగా నిద్ర పడుతోంది... అని చెప్పేవారి సంఖ్య ఈ రోజుల్లో పెరుగుతూ వ‌స్తోంది.

 

ఇలా చాలా మంది రకరకాల కారణాల వల్ల నిద్రకు దూరమవుతున్నారు. ఏం చేయాలో అర్థం కాదు.. దాని ఒత్తిడి పలు రకాల పనులపై ఎఫెక్ట్‌ చూపిస్తుంది. నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య. అయితే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలను అధిగమించొచ్చు. అందులో అరటి పండ్లు.. మెగ్నీషియం, సెరోటోనీన్, మెలటోనిన్ ఉండే వీటిని తినడం వల్ల మంచి నిద్రపడుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కాబట్టి బాగా పండిన అరటిపండుని తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. 

 

గోరువెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దలకాలంనుంచీ వస్తున్న ఆనవాయితీ. ఒక గ్లాసు పాలు రాత్రి ప‌డుకునే ముందు తాగితే హాయిగా నిద్ర‌ప‌డుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్.. నిద్రపుచ్చడంలో కూడా బాగా పనిచేస్తాయి.  ఇందులోని విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, మెలటోనిన్ శరీరాన్ని, బ్రెయిన్‌ని ప్రశాంతంగా మార్చి నిద్రాభంగం లేకుండా చూస్తాయి. హెల్దీ ఫ్యాట్స్, మెగ్నీషియం ఉన్న బాదం కూడా మంచినిద్రకు దోహదం చేస్తుంది. సో.. వీటిని కూడా డైలి తింటూ ఉండండి.
  

మరింత సమాచారం తెలుసుకోండి: