చూయింగ్ గమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.  ఒత్తిడిగా అనిపించినా, ఏం తోచకపోయినా, పని చేస్తున్నప్పుడు నిద్రవచ్చినా, వెంటనే గుర్తొచ్చేది చూయింగ్ గమ్. ముఖ్యంగా టీనేజీ కుర్రాళ్లకు అదో ఫ్యాషన్. గంటలపాటు నోట్లో బబుల్ గమ్ వేసుకొని తెగ నములుతుంటారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 374 బిలియ‌న్ల చూయింగ్ గ‌మ్‌లు అమ్ముడ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌నం 187 బిలియ‌న్ల గంట‌ల‌ను కేవ‌లం చూయింగ్ గ‌మ్ తినేందుకే వెచ్చిస్తున్నామ‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.  మరి ఇంతకూ చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి నష్టమా? లాభమా? అంటే కొన్ని లాభాలున్నాయి.. మరికొన్ని నష్టాలు కూడా కూడా ఉన్నాయి.

 

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి చూయింగ్ గ‌మ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందట. ఆక‌లిగా ఉన్న వారు షుగర్ లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గినట్లు గుర్తించారు. ఆకలి తగ్గడంతో.. తినే మోతాదు తగ్గి బరువు కూడా తగ్గుతాం.టెన్ష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడిగా ఉన్న‌ సమయంలో చూయింగ్ గ‌మ్‌ను తింటే వెంట‌నే ఆ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌మ‌ల‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

 

అయితే అదే ప‌నిగా పెట్టుకుని చూయింగ్ గ‌మ్స్ న‌మ‌ల‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లూ ఉన్నాయి. చూయింగ్ గమ్ దవడ సమస్యలకు కారణమవుతుంది. అతిగా వీటిని నమలడం వల్ల దవడ కండరాలపై ఒత్తిడి పెరిగి.. చెవి, తలనొప్పులకు అవకాశముంది. చూయింగ్ గమ్ తినేటప్పుడు మనకు తెలియకుండానే గాలిని మ్రింగుతాము. ఇది కడుపు ఉబ్బరానికి మరియు పొట్ట ఉదరంలో నొప్పికి దారితీస్తుంది. దాని వల్ల అజీర్తి మరియు హార్ట్ బర్న్ వంటివి ఎదుర్కోవల్సి వస్తుంది.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: