భార‌త్‌లో గంట‌గంట‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. గ‌డిచిన 24గంట‌ల్లో మరో 2వేలకు పైగా కేసులు నమోదుకావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం దేశంలో 26496 మందికి క‌రోనా పాజిటివ్‌గానిర్ధార‌ణ అయిన‌ట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. అయితే వీరిలో 5803 మంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో కొన‌సాగుతు న్న‌ట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. మిగిలిన 19868 మంది మాత్రం ఆయా ఆస్ప‌త్రుల్లో వివిధ ద‌శ‌ల్లో చికిత్స పొందుతు న్న‌ట్లుగా అధికారులు చెబుతున్నారు. 

 

ఇక దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 824కి చేరింది. ఐతే... ఈ కేసుల్లో 30 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గుజరాత్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రం ఢిల్లీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లెక్కలు వ‌రుస‌గా ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర 7628, గుజరాత్ 3071, ఢిల్లీ 2615, మధ్యప్రదేశ్ 2096, రాజస్థాన్ 2083తమిళనాడు 1821, ఉత్తరప్రదేస్ 1793, ఆంధ్రప్రదేశ్ 1061, తెలంగాణ 991, బెంగాల్ 611, కర్ణాటక 500, జమ్మూకాశ్మీర్ 494, కేరళ 457, పంజాబ్ 298, హర్యానా 289, బీహార్ 243, ఒడిశా 94, జార్ఖండ్ 67
ఉత్తరాఖండ్ 48, హిమాచల్ ప్రదేశ్ 40, ఛత్తీస్‌గఢ్ 37, అసోం 36, అండమాన్ నికోబార్ 33, చండీగర్ 28, లఢక్ 20, మేఘాలయ 12, పుదుచ్చేరి 7, గోవా 7, మణిపూర్ 2, త్రిపుర 2, మిజోరం 1, అరుణాచల్ ప్రదేశ్ 1 కేసులు న‌మోదయ్యాయి.

 

ఈశాన్య భార‌త రాష్ట్రాల్లో వైర‌స్ వ్యాప్తి త‌క్కువ‌గా ఉండ‌టంతో మే3 త‌ర్వాత ఆయా రాష్ట్రాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తార‌ని తెలుస్తోంది. ఆర్థిక ప‌త‌నాన్ని ఆప‌డానికి ఈచ‌ర్య ఉప‌క్ర‌మిస్తుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండ‌గా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మ‌ర‌ణ మృదంగం కొన‌సాగిస్తోంది.  ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య ఏకంగా 29 లక్షలకు చేరువైంది. అయితే... మొత్తం కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే చోటుచేసుకున్నాయి.  స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో నమోదైన మొత్తం కేసుల కంటే ఇక్కడి కేసులే ఎక్కువగా ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: