ప్రస్తుత రోజుల్లో విచిత్రమైన వ్యాధులు పుట్టుకొని వస్తున్నాయి. దీనితో చాలా మంది ప్రజలు పోషకాలు అందించే పదార్థాలను తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పోషకాలు అందించే నేరేడు పండ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి నేరేడు చెట్టు వేర్లను నుంచి చిగుర్ల వరకు అన్ని పదార్థాలు కూడా ఔషధ ఫలితమే అని నిపుణులు అంటున్నారు. 

IHG


ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో నేరేడు పండ్లు చాలా సహాయపడుతాయి. నేరేడు పండ్లు తినడం ద్వారా రక్తహీనత దరిచేరదు. అంతేకాకుండా రక్తశుద్ధి కూడా పెరుగుతుంది. ఇక జగిట విరేచనాల బాధపడుతున్నవారు కూడా మూడు చెంచాల నేరేడు రసం కాని నీటిలో నేరేడు బెరడు కషాయం తేనె చక్కెర కలిపి తాగితే ఆ సమస్య ఇక దారికి వస్తుంది. అంతేకాకుండా ఇలా తాగడం ద్వారా నీరసంతో బాధపడే వారు కూడా గట్టెక్కవచ్చు. మధుమేహాలు నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే రక్తంలోని ఇతర పదార్థాలు అదుపులోకి వస్తాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు. 

IHG


అంతే కాకుండా గ్యాస్ సమస్య ఉన్నవారు పండిన నేరేడు పండ్లు తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అలాగే నేరేడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు మెదడు, గుండె ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. ఇక ఎప్పుడూ ఎక్కువ జ్వరంతో బాధితులు ధనియాల రసంతో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత నుండి అలాగే త్వరగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నేరేడు ఆకుల కషాయం తాగితే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ నుండి బయటపడవచ్చు. ఇలా అనేక రకాలుగా మనకు నేరేడు పండ్లు ఉపయోగపడుతాయి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: