తమలపాకు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎందుకంటే తాంబూలంలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అందుకే పవిత్రంగా తమలపాకును తెలుగు వాళ్ళు చూస్తుంటారు. అయితే ఇప్పుడు తమలపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట అవేంటో చూడండి..  తమలపాకు వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయట.. పసుపుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నీ ఉపయోగాలు ఉన్నాయట అవేంటో చుడండి.. 

 


తమలపాకులు మన సంస్కృతిలో భాగం. పూజ నుంచి పెళ్ళి వరకూ తమలపాకు తప్పనిసరి. తాంబూలం వివాహంలో ఓ ముఖ్య పదార్థం. దక్షిణ భారతదేశంలో ఊహించలేం. తమలపాకు ఆహార ప్రయోజనాలు కూడా ఎక్కువే. అవేంటో తెలుసుకోండి..

 

నొప్పి తగ్గిస్తుంది.. 


చిన్న గాయాలూ, వాపు, నొప్పి - వీటి మీద తమలపాకుని ఉంచితే సమస్య తగ్గుతుంది. తమలపాకుని నమిలి తిన్నా ఇదే ప్రయోజనం ఉంటుంది... 

 

 మలబద్ధకాన్ని తగ్గిస్తుంది..

అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ వల్ల వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది.

 

 అరుగుదలకు సహకరిస్తుంది..

అరుగుదలకు సహకరించే ఆసిడ్స్ జీర్ణకోశంలో ఉత్పత్తి అవ్వడానికి తమలపాకు సహకరిస్తుంది. ఇవి సరిగ్గా లేకపోతే ఆహారంలోని పోషకాలను శరీరం స్వీకరించలేదు.

 

ఇంటర్నల్ ఆర్గాన్స్‌ని శుభ్రపరుస్తుంది.. 

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ని తమలపాకులు బయటికి పంపిస్తాయి. రక్తప్రసరణకి సహకరించడమే కాకుండా తమలపాకులు మెటబాలిజంని కూడా వృద్ధి చేస్తాయి.

 

ఆకలి పెంచుతుంది..

నోరు రుచిగా అనిపించకపోయినా, తినాలని లేకపోయినా రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది.

 

దగ్గుని తగ్గిస్తుంది.. 

శరీరంలో కఫం ఏర్పడకుండా చేసి తద్వారా దగ్గు రాకుండా చేస్తుంది తమలపాకు.

 

యాంటి-సెప్టిక్..

తమలపాకుల్లో ఉండే పాలిఫెనాల్ వల్ల ఇది మంచి యాంటి-సెప్టిక్ గా పనిచేస్తుంది. పుండు, గాయం మీది ఈ ఆకుని ఉంచితే నొప్పి కూడా తగ్గుతుంది.


 బ్రాంకైటీస్ కి పనిచేస్తుంది..

ఇన్‌ ఫ్లమేషన్ తగ్గించి, కఫాన్ని కరిగించి బ్రాంకైటీస్‌తో బాధపడుతున్నవారికి సాంత్వన చేకూరుస్తుంది.

 

చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటికైనా తమలపాకు ను తినడం లేదా తమలపాకును వాడటం నేర్చుకోండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: