ప్రపంచాన్ని వణికిస్తోన్న క్యాన్సర్ ఇప్పట్లో కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ప్రభుత్వాలు సూచిస్తున్న అన్ని జాగ్రత్తలను పాటిస్తూ, మంచి ఆహారం తీసుకోవడం  ఉత్తమమైన మార్గం. విటమిన్​-డీ, సీ లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి కరోనా మహమ్మారిని ఎదుర్కొగలమని ఓ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు.

 

ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే- వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్ఠపరచే పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అత్యవసరం. ఇందులో సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్‌-డి, నిమ్మజాతి పండ్ల నుంచి లభించే విటమిన్‌-సి, ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలు అత్యంత ప్రాధాన్యం కలిగినవి. వ్యాధులను కట్టడి చేసే కొన్ని విటమిన్లను గురించి తెలుసుకొని ఉపయోగించడం మంచిది. ఇదే అత్యుత్తమ పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన చర్మ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు డాక్టర్‌ రాబెల్‌ నీల్‌ సూచిస్తున్నారు. విటమిన్‌-డి ఎక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. విటమిన్‌-డి తక్కువగా ఉన్నవారిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని నీల్‌ పరిశీలనలో వెల్లడైన అంశం. ఈ రోగనిరోధక శక్తి ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కోగలమన్నది ఆ పరిశోధన సారాంశం.

 

 

సహజ సిద్ధ పోషకం విటమిన్‌-డి. రసాయన నామం కాల్సిఫెరాల్‌. ఉదయం పూట సూర్య కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే కణజాలం విటమిన్‌-డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఈ విటమిన్‌ మనం తీసుకునే ఆహారం, గుడ్లు, కాలేయం, కాడ్‌ లివర్‌ ఆయిల్‌ ద్వారా కూడా లభిస్తుంది.

 

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పోగుచేసే అతి ముఖ్యమైన సూక్ష్మపోషకం విటమిన్‌-సి. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. ప్రధానంగా నిమ్మజాతి పండ్ల నుంచి లభిస్తుంది. ఉసిరి, బత్తాయి, నిమ్మ, నారింజ, జామ, చెర్రీ, ఆకుకూరల్లో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్‌-సి తరచూ తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్ఛు ప్రతిరోజూ 90 మి.గ్రా. దాకా తీసుకోవచ్ఛు విటమిన్‌-ఈకి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంది. వేరుసెనగ, పొద్దుతిరుగుడు, గుమ్మడి విత్తనాలు, మొలకెత్తిన గింజలు, పిస్తాలలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ తాజా కూరగాయలు, ఆకుకూరలు, బీన్స్‌, నిమ్మజాతి పండ్ల నుంచి లభిస్తుంది. క్యారెట్‌, బొప్పాయి, మునగ, గుమ్మడి, కీరదోస, ఆకుకూరలు తీసుకుంటే విటమిన్‌-ఏ లోపం ఉండదు. మటన్‌, చికెన్‌, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, బీన్స్‌, పప్పుదినుసుల ద్వారా ప్రొటీన్లు లభిస్తాయి. ఆకుకూరలు, బీన్స్‌, లివర్‌, కిడ్నీలలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. గుడ్లు, పాలు, బీన్స్‌, నట్స్‌, విత్తనాల ద్వారా జింక్‌ సమకూరుతుంది. గుడ్లు, బ్రౌన్‌ రైస్‌, బీన్స్‌, ఓట్స్‌, పప్పు దినుసులు, పుట్టగొడుగులు, పాలకూర, అరటిపండు వంటివి సెలీనియం తాలూకు ముడి పదార్థాలు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: