ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.  గ‌త ఏడాది చైనాలో వూహ‌న్ న‌గ‌రంలో వెలుగు చూసిన ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి.. శ‌ర వేగంగా ప్ర‌పంచ‌దేశాల‌కు పాకేసింది. అగ్రరాజ్యాలుగా చెలామణి అవుతున్న దేశాలు సైతం ఈ వైరస్ దెబ్బ‌కు చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి. మ‌రోవైపు మా‌న‌వ‌ళి‌ని ర‌క్షించేందుకు ప్ర‌పంచ‌దేశాల‌ శాస్త్ర‌వేత్త‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా క‌రోనా వ్యాక్సిన్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

IHG

అయితే క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాల‌న్నా.. క‌రోనాతో పోరాటం చేయాల‌న్నా.. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. వాస్త‌వానికి మ‌న శ‌రీరంపై దాడి చేసే అనేక ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాల నుండి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఎంత ప‌టిష్టంగా ఉంటే.. మ‌నం ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అంత గ‌ట్టిగా ఎదుర్కోవ‌చ్చు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.. ఇయ్యూనిటీ పవ‌ర్ పెంచుకోవ‌డ‌మే కాకుండా.. ప్రాణాంత‌క క‌రోనాకు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చు.

IHG

ప్ర‌తి రోజు గోరువెచ్చ‌ని నీటితో ఒక టీ స్పూన్ వాము మ‌రియు కొద్దిగా తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెర‌గ‌డంతో పాటు.. ఆయాసం, దగ్గు, కఫం,  కడుపునొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. అలాగే గోరువెచ్చ‌ని నీటితో తేనె, మిరియాల పొడి క‌లిపి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి.. జ్వరం, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. అదేవిధంగా, ఒక గ్లాస్ నీటిలో చిన్న అల్లం ముక్క‌, కొద్దిగా ప‌సుపు వేసి మ‌రిగించాలి. అనంతరం నీటిని వ‌డ‌క‌ట్టి.. గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తీసుకోవాలి. ఈ డ్రింక్ కూడా ఇమ్యూనిటీ పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: