ఇలా మంచం మీద కూర్చొని కాకుండా శుభ్రంగా మీ లాప్ టాప్ కి ఇంకా మీకు ఒక టేబుల్ ని కుర్చీని ఏర్పాటు చేసుకొని వర్క్ చేసుకుంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గంటలు తరబడి కూర్చోకుండా మధ్యలో కొద్ది సేపు విరామం తీసుకొని అటు ఇటు తిరిగితే మంచిదట. లేదంటే చిన్న పిల్లలతో ఆదుకోవడం అలాంటివి చేస్తే ఒత్తిడి సమస్య దూరం అవుతుందట.ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఉదయం పూట వ్యాయామాలు చెయ్యాలట.వ్యాయామం చెయ్యటం వలన రోజంతా చాలా హుషారుగా ఉంటారట.ఇక మంచి తాజా పండ్లని తింటూ వుండాలట.
అలాగే పని ఒత్తిడిలో పడి చాలా మంది కాఫీలు టీలు తాగుతూ వుంటారు. అవి కూడా ఈ ఎండాకాలంలో మంచివి కావట. రోజుకి రెండు సార్లు తీసుకుంటే చాలు. ఇక అంతకు మించి తీసుకోకూడదు. వాటికి బదులు చల్లని జ్యూసులు, మజ్జిగ లాంటి శీతల పానీయాలు తీసుకోవడం చాలా మంచిదట. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి