
అంతేకాకుండా బ్రొకొలిలో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం మన నాడీ వ్యవస్థకు ఎంతో అవసరం. బ్రొకొలిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లేవల్స్ ని తగ్గిస్తుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారము అని చెప్పవచ్చు. ఇది చూడడానికి అచ్చం క్యాలీఫ్లవర్ లాగే ఉంటుంది. దీనిని అత్యంత ఆరోగ్యకరమైన వెజిటబుల్ గా పరిగణించవచ్చు. ఇందులో అనేక పోషక విలువలతో పాటు విటమిన్ బి5, సి, ఈ లతోపాటు అంటే యాక్సిడెంట్స్ అలాగే శక్తివంతమైన న్యూట్రియన్స్ కూడా ఉంటాయి.
ఇది మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో జీర్ణ వ్యవస్థను అనగా పేగులు, పొట్టను శుభ్రం చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, జీర్ణక్రియలను పెంపొందిస్తుంది. అలాగే మలబద్దక , ఉదర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా బ్రొకోలీలో అత్యంత శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, బీటా కెరటిన్, టూటిన్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఏర్పడే టాక్సిన్లను ఫ్రీ రాడికల్స్ సులభంగా తొలగించబడతాయి. ఎముకలను బలోపేతం చేయడానికి చక్కగా సహాయపడుతుంది. క్యాన్సర్ కారకం అయ్యే కెమికల్స్ ను శరీరం బయటకు విసర్జించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది .కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆహారం మీ భోజనంలో తప్పకుండా తీసుకోవాల్సిందే.