ప్రతి రోజు సరైన వ్యాయామం, జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు  అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్‌ తీసుకుంటే కూడా మీ శరీరంలో సోడియం లెవెల్ పెరుగుతుంది. అలాగే పొటాషియం లెవెల్స్ తగ్గుతాయి.అయితే ఎలక్ట్రోలైట్స్ ఈ అసమతుల్యత శరీరంలో నీరు నిలుపుదలకి దారితీస్తుంది. రక్త పరిమాణం కూడా పెరుగుతుంది. ఇక అధిక రక్తపోటుతో బాధపడేవారు  కొన్ని రకాల ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.అధిక రక్తపోటు ఉన్న రోగులు టమోటాలు, క్యారెట్లు, బ్రోకలీ, చిలగడదుంపలు, ఆకుకూరలు ఇంకా అలాగే ఇతర కూరగాయలను ఖచ్చితంగా తీసుకోండి.ఇక బీపీ సమస్య ఉన్న వారికి మాంసాహారంలో చేపలు చాలా మంచివి. సాల్మన్, హెర్రింగ్, ట్యూనా (ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి) వంటివి గుండె-ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచివి.బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, కిడ్నీ బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు ఇంకా సోయాబీన్ ఉత్పత్తులు (టోఫు, టెంపే) మాంసానికి చాలా మంచి ప్రత్యామ్నాయాలు.


అయితే, నట్స్‌లో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హైపర్‌టెన్సివ్ రోగులు ఖచ్చితంగా వాటిని మితమైన పరిమాణంలో తీసుకోవాలి.అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లను తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే నిలువ ఉండాలని పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా కలుపుతారు.అందువల్ల ఇది బీపీ రోగులకు అంత మంచిది కాదు. మినరల్ వాటర్ బీపీ రోగులకు అంత మంచిది కాదు. దీన్ని తాగడం వల్ల బీపీ రోగులకు ఖచ్చితంగా హాని కలుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం. లీటరు మినరల్ వాటర్ వచ్చేసి 200 mg సోడియం కలిగి ఉంటుంది. ఇంకా  అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఆల్కహాల్ తాగడం ఖచ్చితంగా మానేయాలి.జున్ను అనేది పాల ఉత్పత్తి కావచ్చు. అయితే ఇందులో ప్రోటీన్,  కాల్షియం ఉంటాయి. కానీ ఇందులో సోడియం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే ఈ చీజ్ తినడం వల్ల కూడా రక్తపోటు, కొలెస్ట్రాల్ రెండూ కూడా పెరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: