మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువగా కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. తాజా కూరగాయలు శరీరానికి పలు రకాల పోషకాలను అందిస్తాయని ఎంతోమంది నిపుణులు తెలియజేస్తున్నారు .కూరగాయలలో ముఖ్యంగా బెండకాయలు చాలా మంచి వట. బెండకాయలు సీజన్లో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో లభిస్తూ ఉన్నాయి.. బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉండడంమే కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఫైబర్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయ వల్ల ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.


బెండకాయలను తక్కువగా క్యాలరీలు ఉంటాయి ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల.. రక్తంలో సుగర్ లెవ్వాల్సిన అదుపులో ఉంచేలా చేస్తాయి. బెండకాయలలో ఉండేటువంటి ప్రోటీన్స్ మన శరీరానికి చాలా ఉపయోగపడుతాయి. ఈ ప్రోటీన్స్ వల్ల వెంటనే శక్తి కూడా లభిస్తుంది. బెండకాయ తినడం ద్వారా శరీరంలోని LDL కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తుందట. ఉబకాయంతో ఇబ్బంది పడేవారు తరచుగా బెండకాయలను తింటే చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. బెండకాయలు తినడం వల్ల శరీరానికే కాకుండా గుండెకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందట. బెండకాయలు క్యాన్సర్ ను తగ్గించి పోషక గుణాలు చాలా పుష్కలంగా లభిస్తాయట.

బెండకాయలు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ ను వ్యతిరేకంగా పనిచేస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ బెండకాయలలో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు వీటిని తినడం చాలా మంచిది.. బెండకాయలలో ఉండే ఫోలేట్ గర్భవతి అయిన తల్లికి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తుందట.బెండకాయ తింటే జీర్ణశక్తి వెంటనే పెరుగుతుంది. బెండకాయల్లోని తేమ జిగురు వల్ల కొంచెం తిన్న తర్వాత కడుపు నిండినట్టుగా అనిపిస్తుందట. బెండకాయలు తినడం వల్ల మూత్ర విసర్జన కూడా ఫ్రీగా పనిచేస్తుంది.. ఎక్కువగా బెండకాయలు తినేవారు హైడ్రే టెడ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఖచ్చితంగా వారంలో రెండుసార్లు అయినా బెండకాయలు తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: