సమాజంలో మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలు తింటూ ఉంటాం. ఒక్కో కూరగాయలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీర బరువు నియంత్రించడం లో బీన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే ఈ బీన్స్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

 బీన్స్ లో పుష్కలమైన యాంటీ  యాసిడెంట్ విటమిన్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ జింక్,వంటివి కలిగి ఉంటుంది. కనుక ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం. ఇది చాలా తక్కువ శాతం లో కొవ్వును కలిగి ఉంటుంది. కనుక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మనం ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాం. బీన్స్ ఎక్కువగా ఫైబర్ ని కలిగి ఉండడం వలన జీర్ణ క్రియ వ్యవస్థలో చాలా ఉపయోగపడుతుంది.

మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా  బీన్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట కార్బోహైడ్ మరియు ప్రొటీషన్ కలిగి ఉంటుంది.ఇది మధుమైన వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. అంతేకాకుండా రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. శరీర పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విస్తరణమైన ప్రోటీన్స్ అవసరం. ప్రోటీన్స్ కి మూలాధారం బీన్స్  అయినందువలన శాఖాహారులకు ఇది మంచి ఆహారం.

 బీన్స్ లో ఎక్కువ ఫైబర్ యాంటీ యాసిడెంట్ ని కలిగి ఉండడం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవడం వలన అధిక బరుగును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన ఆరోగ్యానికి కావలసిన మంచి ప్రోటీన్స్ అందజేయడం లో  బీన్స్ కీలక పాత్ర పోషిస్తుంది.  కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేయడంలో బీన్స్ కీలక పాత్రను కలిగి ఉంటుంది.కావున బీన్స్ ని తీసుకోవడం మనకు వచ్చే  కొన్ని రకాల వ్యాధులను దూరం చేయవచ్చును.అందుచేతనే ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కసారైనా బీన్స్ ను ఏదైనా కూరలలో వేసుకొని తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: